తెలంగాణ

telangana

prathidwani: పొట్టి క్రికెట్ కెప్టెన్సీకి కోహ్లీ రాజీనామా వెనక కారణాలేంటి? రోహిత్, రాహుల్, పంత్‌ల్లో ఎవరికి ఛాన్స్?

By

Published : Sep 18, 2021, 10:48 PM IST

భారత క్రికెట్‌ జట్టులో ఏం జరుగుతోంది. టీ ట్వంటీ ప్రపంచకప్ తర్వాత ఆ ఫార్మాట్ సారథ్యానికి టాటా అన్న కింగ్ కోహ్లీ నిర్ణయం మాములు వేడి రేపలేదు. కోహ్లీ రాజీనామా వెనక కారణాలు ఏమిటి? కెప్టెన్‌ - వైస్ కెప్టెన్ మధ్య విబేధాలు నిజమేనా? ఆడేది ఎవరు.. ఆడిస్తోంది ఎవరు? రోహిత్, రాహుల్, పంత్‌ల్లో ఎవరికి ఛాన్స్? ఇంట - బయట ఇలాంటి ఎన్నో ప్రశ్నలు. కోహ్లీ నిర్ణయాన్నిస్వాగతించేవారు కొందరు... జీర్ణించుకోలేక పోతున్న వారు మరికొందరు. సాధారణ క్రికెట్ అభిమానుల్లో అయితే ఎవరికి తోచిన విశ్లేషణలు వారివి. జట్టులో అంతరాలు నివురుగప్పిన నిప్పులానే ఉన్నాయా? జట్టు కూర్పులో రాజకీయాలు నడుస్తున్నాయా? అని తీవ్రమైన ప్రశ్నలు సంధిస్తున్న వారూ ఉన్నారు. ఇదే అంశంపై ఈరోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.

ABOUT THE AUTHOR

...view details