తెలంగాణ

telangana

Prathidwani: అస్తవ్యస్తంగా పట్టణాభివృద్ధి బృహత్ ప్రణాళికలు

By

Published : Apr 5, 2022, 9:49 PM IST

Updated : Feb 3, 2023, 8:22 PM IST

Prathidwani: అంతా అస్తవ్యస్తం. శరవేగంగా విస్తరిస్తున్న నగరాలు, పట్టణాలకు ఇప్పుడు బృహత్ ప్రణాళికల బెంగ పట్టుకుంది. మరింత అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన అన్న పాలకుల మాటల మేరకు కొత్త ప్రణాళికలైతే పట్టాలెక్కడం లేదు. ఉన్న ప్రణాళికలు అక్కరకు రావడం లేదు. ఉన్న మాస్టర్‌ప్లాన్స్‌లోనూ అనేక లొసుగులు. ఒక్క హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ మాస్టర్‌ ప్లాన్ 2031లోనే.. 10 వేలకు పైగా తప్పులు గు‌ర్తించారంటే సమస్య తీవ్రత అర్థం చేసుకోవచ్చు. అలాంటి లోపాలతో కూడిన మాస్టర్‌ప్లాన్స్‌నే ప్రామాణికంగా తీసుకోవడం వల్ల సామాన్యులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మరి... అభివృద్ధికి కీలకమైన బృహత్ ప్రణాళికల విషయంలో పురపాలక శాఖ ఎందుకింత ఉదాసీనంగా ఉంటోంది? పరిస్థితి చక్కదిద్దేది ఎలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated :Feb 3, 2023, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details