తెలంగాణ

telangana

నదికి పూజ.. కారుతో సహా కొట్టుకుపోయిన మహిళ.. లక్కీగా..

By

Published : Jun 25, 2023, 2:32 PM IST

Woman car drifts in river in Panchkula Woman trapped in river with car heavy rain in haryana

నది వద్ద పూజలు చేసేందుకు వెళ్లి.. కారుతో సహా కొట్టుకుపోయింది ఓ మహిళ. వెంటనే గమనించిన పోలీసులు.. స్థానికుల సహాయంతో ఆమెను కాపాడారు. హరియాణాలోని పంచ్​కూలా జిల్లాలో ఈ ఘటన జరిగింది.
అసలేం జరిగిందంటే?
నైరుతి రుతుపవనాల కారణంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో కూడా రెండు రోజులుగా.. వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. భారీ వర్షాల ధాటికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని ఖరక్​ మంగోలి గ్రామం వద్ద ఉన్న నదిలో నీటి మట్టం.. ఆదివారం ఒక్కసారిగా పెరిగింది. అదే సమయంలో నది వద్ద పూజలు చేసేందుకు.. ఓ మహిళ తన తల్లితో కారులో వచ్చింది. 

అనంతరం నది ఒడ్డున తన కారును పార్క్​ చేసింది. ఆ సమయంలోనే నీటి ప్రవాహం మరింత పెరిగింది. దీంతో తల్లి వెంటనే కారు దిగగా.. బాధితురాలు లోపలే చిక్కుకుపోయింది. నీటి ప్రవాహనికి కారుతో సహా ఆమె కొట్టుకుపోయింది. వెంటనే గమనించిన పోలీసులు.. హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో తాడును ఉపయోగించి మహిళను కాపాడారు. చికిత్స కోసం వెంటనే స్థానిక ప్రభుత్వాసపత్రికి తరలించారు. 

ABOUT THE AUTHOR

...view details