తెలంగాణ

telangana

ట్యాంకులో పడ్డ ఏనుగు పిల్ల.. అనేక గంటల అవస్థలు.. అటవీ అధికారులు లేట్​.. చివరకు..

By

Published : Jun 27, 2023, 10:19 AM IST

Baby elephant falls in water tank in Jorhat

రసాయనాల ట్యాంకులో పడిపోయింది ఓ ఏనుగు పిల్ల. దాని నుంచి బయటకు రాలేక అనేక గంటల పాటు అవస్థలు పడింది. ఈ ఘటన అసోం జోర్​హట్​ జిల్లాలోని మరియాణిలో సోమవారం జరిగింది. అటవీ అధికారులు ఆలస్యంగా రావడం వల్ల.. స్థానికులే ఏనుగు పిల్లను రక్షించారు.

ఇదీ జరిగింది
గిబ్బాన్​ అభయార్యానికి చెందిన ఓ ఏనుగు పిల్ల దారి తప్పి మరియాణి సమీపంలోని హులోంగురి టీ ఎస్టేట్​కు వచ్చింది. ఈ క్రమంలోనే అక్కడే  ఉన్న రసాయనాలు కలిపే ఓ ట్యాంకులో ప్రమాదవశాత్తు పడిపోయింది. ట్యాంకు నిండా రసాయనాలతో కూడిన నీరు ఉంది. దీంతో ఆ ట్యాంకు నుంచి బయటకు రాలేక ఏనుగు పిల్ల నానా అవస్థలు పడింది. దీనిని గమనించిన స్థానికులు.. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు రావడం ఆలస్యం కావడం వల్ల స్థానికులు ఏనుగు పిల్లను బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేపట్టారు. గంటల పాటు శ్రమించి ఏనుగు పిల్లను బయటకు తీశారు. అనంతరం ఏనుగు పిల్లను సమీపంలోని గిబ్బాన్​ అభయారణ్యానికి తరలించారు. 

ABOUT THE AUTHOR

...view details