తెలంగాణ

telangana

Warangal NIT Gold Medal Students 2023 : 21వ స్నాతకోత్సవంలో నిట్ వరంగల్ విద్యార్థుల ప్రతిభకు పురష్కారాలు

By ETV Bharat Telangana Team

Published : Sep 19, 2023, 4:44 PM IST

Warangal NIT Gold Medal Students 2023

Warangal NIT Gold Medal Students 2023 : లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నారు.. దాన్ని చేరేందుకు పట్టుదలతో కృషి చేసి.. సాధించారు. నిట్‌ వరంగల్‌లో చేరిన మొదటి రోజు నుంచి విద్యలో ఉన్నత ప్రతిభ కనబర్చి గోల్డ్‌ మెడల్‌ పొందాలనే లక్ష్యాన్ని వారు నెరవేర్చుకున్నారు. ఇటీవల వరంగల్ నిట్ విద్యాసంస్థ నిర్వహించిన 21 స్నాతకోత్సవంలో.. నీతి ఆయోగ్ సభ్యులు వీకే సారస్వత్‌ చేతుల మీదుగా తల్లిదండ్రుల ముందు బంగారు పతకాలు అందుకుని మురిసిపోయారు. ఏడుగురు విద్యార్థులు స్వర్ణ పతకాలు సాధించగా.. 2029 మంది విద్యార్థులు తెలుపు, కాషాయ రంగు కలయికతో అందరూ ఏక రూప దుస్తులు ధరించి డిగ్రీ పట్టాలు తీసుకోవడం ఎంతగానో ఆకట్టుకుంది.

NIT Warangal 21st Convocation : వీరిలో ఎంతోమంది ఇప్పటికే క్యాంపస్ సెలక్షన్స్​లో ఎంపికై.. ఆకర్షనీయమైన వేతనాలతో కొలువులు పొందారు. కొవిడ్ కారణంగా రెండు సంవత్సరాల పాటు తరగతులు లేక ఇబ్బందులు పడినా.. అనుకున్నది సాధించామని విద్యార్థులు చెబుతున్నారు. కొవిడ్ తరువాత రెండేళ్లలో తరగతులు నిర్వహించడంలో కానీ.. కళాశాల ఫ్యాకల్టీ అందించిన తోడ్పాటు కానీ అంతా ఇంతా కాదని విద్యార్థులు వివరించారు. అదేవిధంగా వారి ఉన్నతికి ఎల్లప్పుడు తోడుగా నిలిచిన తల్లిదండ్రుల ముందు బంగారు పతకాలు అందుకోవటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.    

ABOUT THE AUTHOR

...view details