తెలంగాణ

telangana

Viral Video of Theft at More Super Market : ఇలా వచ్చారు.. అలా దోచేశారు.. కెమెరాలు ఉన్నాయని చూసుకోవాలి కదా బ్రో

By

Published : Aug 21, 2023, 1:32 PM IST

Theft in Supermarket at Tandoor Town

Viral Video of Theft at More Super Market in Tandoor : వికారాబాద్ జిల్లా తాండూరులోని మోర్ సూపర్ మార్కెట్‌లో దొంగతనం జరిగింది. ఆ సూపర్‌ మార్కెట్ షటర్‌ను బండ రాయితో బద్దలు కొట్టి చోరి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. సూపర్‌ మార్కెట్ సిబ్బంది ఉదయం విధులకు రాగా.... షటర్ విరిగిపోయి, తాళాలు పగలి ఉండటంతో దొంగతనం జరిగిందని భావించి ..... పోలీసులకు సమాచారం ఇచ్చారు.  సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. దొంగలు సూపర్ మార్కెట్‌లో ఏం తీకుకెళ్లారో తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. ఈ ఫుటేజీలో ఇద్దరు వ్యక్తులు షటర్ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించడం.. ఆ తర్వాత మార్కెట్​లోని సామాన్లు ఒక్కొక్కటిగా ఇద్దరూ తీసుకెళ్లడం కనిపించింది. ముఖ్యంగా ఖరీదైన ఎలక్ట్రిక్ పరికరాలను ఇద్దరూ కలిసి చాలా జాగ్రత్తగా ఎత్తుకెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయింది. అయితే దొంగలు.. పక్కా ప్లాన్ ప్రకారం చోరీ చేశారని.. కానీ సీసీటీవీ సంగతి మర్చిపోయారని పోలీసులు అన్నారు. ఈ ఫుటేజీ ద్వారా వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details