తెలంగాణ

telangana

శామీర్​పేట్​ ఎల్లమ్మ ఆలయంలో చోరీ - సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు

By ETV Bharat Telangana Team

Published : Dec 25, 2023, 2:46 PM IST

Theft at Yellamma Temple in Shameerpet

Theft at Yellamma Temple in Shameerpet :మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్​పేట మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి వేళ గుడిలోకి ప్రవేశించిన ఇద్దరు దొంగలు, ఆలయ తాళాలను పగులగొట్టి అమ్మవారి నగలను అపహరించారు. సదరు దృశ్యాలన్నీ ఆలయ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

Thieves Robbed in shameerpet Yellamma Temple :దుండగులు అమ్మవారి వెండి కిరీటంతో పాటు వెండి తొడుగులు, మూడు తులాల విలువ చేసే బంగారు పుస్తెలను ఎత్తుకెళ్లారు. వీటి విలువ సుమారు రూ.5 లక్షల వరకు ఉంటుందని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. ఇద్దరు దుండగులు లోపలికి ప్రవేశించి చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాలు, క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించి దొంగలను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.

ABOUT THE AUTHOR

...view details