తెలంగాణ

telangana

Pawan Sick in Varahi Tour: పవన్​కు అనారోగ్యం.. ఆందోళనలో జనసైనికులు, అభిమానులు

By

Published : Jun 27, 2023, 1:57 PM IST

Pawan Kalyan Sick

Pawan Kalyan Sick in Bhimavaram Tour: జనసేన అధ్యక్షుడు, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అనారోగ్యానికి గురయ్యారు. వారాహి విజయ యాత్రలో భాగంగా అవిశ్రాంతంగా పర్యటనలు చేస్తుండటం, దీనికి తోడు ఉపవాస దీక్ష పాటిస్తుండటంతో పవన్‌ ఇబ్బంది పడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా పెదఅమిరంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారని సమాచారం. అయితే పవన్​ అనారోగ్యం కారణంగా ఈరోజు (జూన్ 27) భీమవరం నియోజకవర్గ నేతలతో ఉదయం 11 గంటలకు నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేశారు. మధ్యాహ్నం తర్వాతే ఈ భేటీ ప్రారంభం కానున్నట్లు సమాచారం. కాగా, పవన్‌ కల్యాణ్‌ అనారోగ్యానికి గురయ్యారని తెలియగానే ఆయన అభిమానులు కాస్తా ఆందోళనకు గురయ్యారు. అయితే స్వల్ప అనారోగ్యమే అని పార్టీ వర్గాలు తెలియచేయడంతో కాస్త కుదుట పడ్డారు. అయితే ఇటీవల వరుసగా సినిమా షూటింగుల్లో పాల్గొన్న పవన్.. వెంటనే వారాహి విజయ యాత్ర చేపట్టారు. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాను చుట్టేసిన ఆయన.. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. వైసీపీ శ్రేణులు అవినీతి, అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంగా ఈ యాత్ర చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details