తెలంగాణ

telangana

Pawan Kalyan Birthday Special: వరినారుతో రైతుల అక్షరోద్యమం.. జనసేన లోగో ఏర్పాటుతో పవన్​పై అభిమానం చాటిన వైనం

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2023, 3:22 PM IST

Pawan_Kalyan_Birthday_Special

Pawan Kalyan Birthday Special: జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ పుట్టిన రోజు సందర్భంగా అభిమానాన్ని గుంటూరు జిల్లాలోని ఓ గ్రామ రైతులు వినూత్నంగా వ్యక్త పరిచారు. వరి నారుతో జనసేన పార్టీ లోగో రూపోందించగా.. ఆ దృశ్యాలు అబ్బురపరిచేలా ఉన్నాయి. శిల్పి ఉలితో చెక్కిన మాదిరి ఆకాశంలో నుంచి కనిపిస్తున్న ఆ వరి నారు కన్నులవిందుగా ఉంది. కౌలు రైతుల కోసం పవన్ చేస్తున్న సహాయానికి కృతజ్ఞతగా.. ఆ గ్రామ కౌలు రైతులందరూ కలిసి ఇలా చేసినట్లు వివరించారు.

ఇంతకీ ఇది ఏర్పాటు చేసింది ఎవరంటే.. గుంటూరు జిల్లాలోని కొల్లిపర్ల మండలం అత్తోట గ్రామ కౌలు రైతులు.. వరి నారుతో  జనసేన పార్టీ లోగోను ఏర్పాటు చేశారు. ఆ లోగోతో పాటు 'కౌలు రైతుల కోసం పవన్.. పవన్ కోసం అత్తోట కౌలు రైతులు' అంటూ శీర్శికను సైతం వరి నారుతోనే ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్నందుకు ఇలా చేశామని రైతులు వివరించగా.. ఇందుకోసం మైసూర్ మళ్లికా, కాలాబట్టి వరి రకాల వడ్లను వినియోగించినట్లు పేర్కొన్నారు. పంట చేతికి వచ్చిన తర్వాత నూర్పిడి చేసి వచ్చిన ధాన్యాన్ని పవన్​ కల్యాణ్​కి అందజేస్తామని రైతులు వివరిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details