తెలంగాణ

telangana

ఓయూలో విద్యార్థుల ధర్నా- వీసీ రవీందర్ రాజీనామాకు డిమాండ్

By ETV Bharat Telangana Team

Published : Dec 14, 2023, 3:51 PM IST

OU Students Protest to Remove VC Ravinder

OU Students Protest to Remove VC Ravinder :విద్యార్థుల నిరసనలతో ఉస్మానియా యూనివర్సిటీ అట్టుడికింది. ఓయూ వైస్ ఛాన్స్‌లర్‌ రవీందర్‌ యాదవ్ వీసీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ధర్నాకు దిగారు. అనంతరం విద్యార్థులు వీసీ కార్యాలయాన్ని ముట్టడించబోయారు.

Students Protest at Osmania University :ఓయూ వీసీ రవీందర్ విద్యార్థి వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని విద్యార్థులు పేర్కొన్నారు. పరిపాలన భవనం వద్ద ఉన్న ముళ్ల కంచెలను తొలగించే ప్రయత్నం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థులను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఘర్షణ వాతావరణం నెలకొంది. విద్యార్థులు పరిపాలనా భవనాన్ని ముట్టడించడానికి ప్రయత్నించడంతో ఓయూ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. యూనివర్సిటీ వీసీ రవీందర్ యాదవ్ రాజీనామా చేసే వరకు తమ నిరసనలు ఆపమని విద్యార్థులు హెచ్చరించారు. 

ABOUT THE AUTHOR

...view details