తెలంగాణ

telangana

గత ఎమ్మెల్యే పదేళ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు : మైనంపల్లి రోహిత్​రావు

By ETV Bharat Telangana Team

Published : Nov 27, 2023, 2:37 PM IST

మైనంపల్లి రోహిత్​రావు

Mynampally Rohit Interview :మెదక్నియోజకవర్గంలో ఎక్కడ తిరిగినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. భారీ మెజార్టీతో గెలుస్తామని రోహిత్​ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నామని తెలిపారు. కరవు కాలంలో పేద ప్రజలకు తాగునీరు అందించామని.. సొంత నిధులతో పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగు పరిచానని వెల్లడించారు. ప్రజలే తమ సమస్యలపై పోరాడాలని తనను దీవిస్తున్నారని రోహిత్ రావు వివరించారు.

Mynampally Rohit Fires On Padma Devender Reddy :నియోజకవర్గంలోకాంగ్రెస్​ నుంచి టికెట్​ ఆశించి భంగపడ్డవారి వల్ల తమ పార్టీకి ఎలాంటి నష్టం లేదని రోహిత్ చెప్పారు. తమకు ప్రత్యర్థి ఎవరు లేరని వెల్లడించారు. గత ఎమ్మెల్యే పదేళ్లలో నియోజకవర్గాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. బీఆర్​ఎస్​ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డికి కనీస డిపాజిట్లు కూడా రావంటున్న మైనంపల్లి రోహిత్‌తో మా ప్రతినిధి ముఖాముఖి..

ABOUT THE AUTHOR

...view details