తెలంగాణ

telangana

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సీఎం కుర్చీ కోసం కొట్టుకోడానికే సరిపోతుంది : హరీశ్‌రావు

By ETV Bharat Telangana Team

Published : Nov 21, 2023, 5:23 PM IST

Minister Harish Rao Election Campaign in Karimnagar

Minister Harish Rao Election Campaign in Karimnagar : తెలంగాణ ఉద్యమ సమయంలో 'జై తెలంగాణ' అంటే కాల్చి పడేస్తానన్న తుపాకీ రాముడు రేవంత్ రెడ్డి అని, అలాంటి వ్యక్తికి మద్దతిచ్చి ఆగం కావొద్దని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్‌ కుమార్‌కు మద్దతుగా నిర్వహించిన రోడ్‌ షో, కార్నర్‌ మీటింగ్‌లో మంత్రి పాల్గొన్నారు.

BRS Corner Meeting at chigurumamidi : ఈ సందర్భంగా ఓగులాపూర్ భూ నిర్వాసితులకు ఈసారి అధికారంలోకి రాగానే.. ఏది కోరితే అది ఇస్తామని హరీశ్‌రావు తెలిపారు. దానికి పూర్తి బాధ్యత తానే తీసుకుంటానన్నారు. ఈ క్రమంలోనే గౌరవెల్లి ప్రాజెక్టుకు కాలు అడ్డం పెట్టిన కాంగ్రెస్ మాటలు నమ్మొద్దని, కాలువలు తవ్వించి సంవత్సరం లోపు చిగురుమామిడికి సాగు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌లో వర్గపోరు ఉందని, ఏ వర్గానికి ఆ వర్గం సీఎం కుర్చీ కోసం కొట్లాటలు పెట్టుకుంటాయని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details