తెలంగాణ

telangana

Lakshmi Barrage Bridge Slightly Sagged in Kaleshwaram Project : మేడిగడ్డ బ్యారేజీపై కుంగిన రహదారి.. నిలిచిన రాకపోకలు

By ETV Bharat Telangana Team

Published : Oct 21, 2023, 10:45 PM IST

Medigadda Barrage Slightly Sagged in Kaleshwaram Project

Medigadda Barrage Slightly Sagged in Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజీ మీదుగా రాకపోకలు సాగించే వంతెన స్వల్పంగా కుంగింది. బ్యారేజీలోని బీ బ్లాక్ పరిధిలో గల 18,19, 20, 21 పిల్లర్ల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు ముందు జాగ్రత్తగా అంబటిపల్లి నుంచి వంతెన మీదుగా మహారాష్ట్రకు వెళ్లే వాహన రాకపోకలను నిలిపివేశారు. బ్యారేజీ సమీప ప్రాంతంలోకి ప్రజలను రాకుండా పూర్తిగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పరిచారు.

Lakshmi Barrage Bridge Issue :ఇక వంతెన విషయానికి వస్తే సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఈ బ్యారేజీ నిర్మాణం పూర్తి చేసుకుంది. రికార్డు స్ధాయిలో పనులు చేపట్టి మరీ బ్యారేజీని నిర్మించారు. ముఖ్యంగా దీనిని రివర్స్ పంపింగ్ విధానం ద్వారా నీటిని ఎత్తిపోయడానికి డిజైన్ చేశారు. గోదావరి నదిలోని నీటిని తాగునీరు, నీటి పారుదల కోసం ఉపయోగించుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఈ మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి చేసుకుంది.

ABOUT THE AUTHOR

...view details