తెలంగాణ

telangana

నాకు పెళ్లి చేయకపోతే ఇక్కణ్నుంచి దూకేస్తా - టవర్​ ఎక్కి వ్యక్తి హల్​చల్​

By ETV Bharat Telangana Team

Published : Jan 1, 2024, 2:02 PM IST

పెళ్లి కావట్లేదంటూ ఓ వ్యక్తి టవర్​ ఎక్కి హల్​చల్ - కాపాడిన పోలీసులు​

Man Climbed Tower in Nalgonda :నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పెళ్లి కావట్లేదంటూ ఓ వ్యక్తి హల్​చల్ సృష్టించాడు. మద్యం మత్తులో ప్రచార హోర్డింగ్ టవర్ ఎక్కి గోలగోల చేశాడు. తనకు వివాహం చేస్తానని మాట ఇవ్వకపోతే దూకేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అటుగా వెళ్తున్న వారు చూసి పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. 

Nalgonda Man Threatened To Jump From Tower :మిర్యాలగూడ పట్టణం ముత్తిరెడ్డి కుంటకు చెందిన ఎండి ఖలీముద్దీన్ కొంతకాలంగా మద్యానికి బానిసై పని పాట లేకుండా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్ 31వ తేదీన రాత్రి 10:00 గంటలకు సాగర్ రోడ్డులోని ఓ ప్రచార హోర్డింగ్ ఎక్కి తనకు పెళ్లి చేయకపోతే  దూకుతానని బెదిరించాడు. గమనించిన స్థానికులు అతణ్ని వారించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రెండు గంటలు శ్రమించి ఫైర్ సిబ్బంది సాయంతో అతణ్ని క్షేమంగా కిందికి దింపారు. అనంతరం కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్​కు తీసుకువెళ్లారు. 

ABOUT THE AUTHOR

...view details