తెలంగాణ

telangana

బషీర్​ బాగ్​ ఆలయాన్ని శుభ్రం చేసిన కిషన్​ రెడ్డి

By ETV Bharat Telangana Team

Published : Jan 17, 2024, 2:04 PM IST

Kishanreddy

Kishan Reddy Cleans Bashir Bagh Temple : అయోధ్య భవ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో హిందువులందరూ పరోక్షంగా పాల్గొనాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ఆలయ స్వచ్ఛత పిలుపు మేరకు బషీర్ బాగ్ అమ్మవారి ఆలయాన్ని ఆయన స్థానిక నాయకులతో కలిసి శుభ్రం చేశారు.

ఈనెల 22వ తేదీన అయోధ్య రామమందిరంలో రామ్ ​లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం జరుగుతున్న సందర్భంగా ఆరోజు అందరూ ఇళ్లు శుభ్రం చేసుకొని, దీపాలు వెలిగించాలని కిషన్ రెడ్డి కోరారు. ఇది భారతావనిపై 500 ఏళ్ల తర్వాత అయోధ్య రామయ్యకు జరుగుతున్న పట్టాభిషేకంగా ఆయన అభివర్ణించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు స్థానికంగా ఉన్న ఆలయాలను శుభ్రం చేయాలని సూచించారు. 'మన సంకల్పం వికసిత భారత్​' అంటూ ప్రతిజ్ఞ చేసిన కిషన్ రెడ్డి ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details