తెలంగాణ

telangana

Kalasha Ganesh Idol in Nizamabad : 1500 కలశాలతో బొజ్జ గణపయ్య.. చూస్తే వావ్‌ అనాల్సిందే!

By ETV Bharat Telangana Team

Published : Sep 22, 2023, 7:52 PM IST

Kalasa Ganesh Idol in Nizamabad Town

Kalasha Ganesh Idol in Nizamabad: వినాయక చవితి వచ్చిందంటే చాలు.. గణేశుడి విగ్రహాన్ని పెట్టేందుకు యువకులందరూ వివిధ రకాలుగా ఆలోచించి.. ఆ గ్రామంలో తమదే హైలైట్‌గా నిలవాలని అనుకుంటారు. మరికొందరు పర్యావరణహితంగా మట్టి విగ్రహాన్ని.. రంగుల ఉపయోగించకుండా తయారు చేయడం.. ఇలా చాలా విధాలుగా ఏర్పాటు చేస్తారు. అదే విధంగా నిజామాబాద్‌ జిల్లాలో యువత వినూత్నంగా ఆలోచించి.. పర్యావరణహితంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి స్థానికులను ఆకట్టుకుంటున్నారు.

Coconut Vinayaka Idol in Nizamabad : నిజామాబాద్‌ నగరంలో పర్యావరణహిత గణనాథులు ఆకట్టుకుంటున్నాయి. నగరంలోని వర్ని చౌరస్తాలో కలశాలతో వినాయక విగ్రహాన్ని(Kalasa Vinayaka Idol) ఏర్పాటు చేశారు. భక్త గణేశ్ మండలి ఆధ్వర్యంలో 2016 నుంచి ప్రతి సంవత్సరం పర్యావరణహిత విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది 1500 కలశాలతో విగ్రహం ఏర్పాటు చేశారు. కలకత్తాకు చెందిన కళాకారులు 26 రోజుల పాటు కష్టపడి విగ్రహాన్ని తయారు చేశారు. కలశాలు, వాటి లోపల కొబ్బరికాయలను అమర్చి విగ్రహం తయారు చేశారు. నిమజ్జనం రోజు కలశాలు, కొబ్బరికాయలను భక్తులకు ఇవ్వనున్నామని గణేశ్ కమిటీ సభ్యులు తెలిపారు. వినాయకుడిని దర్శించేందుకు స్థానికులు అధిక సంఖ్యలో వచ్చి.. సెల్ఫీలు తీసుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details