తెలంగాణ

telangana

Hyderabad Ganesh Nimajjanam Traffic : భాగ్యనగరంలో గణనాథుల నిమజ్జనం.. వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు..

By ETV Bharat Telangana Team

Published : Sep 29, 2023, 12:28 PM IST

Huge Traffic Jam Due to Ganesh Nimajjanam in Hyderabad

Hyderabad Ganesh Nimajjanam Traffic  :  హైదరాబాద్‌లో గణనాయకుల శోభాయాత్ర.. నిమజ్జనోత్సవం అత్యంత కోలాహలంగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 11 రోజులపాటు ఘనంగా పూజలందుకున్న గణపయ్య గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్‌ సహా 100 చోట్ల ఏర్పాటు చేసిన కేంద్రాల్లో నిమజ్జనం కార్యక్రమాలు కొనసాగుతున్నాయి

హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జనం ఇంకా కొనసాగడంతో..వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతా్లో పోలీసులు అనుమతించక పోవడంతో... ట్యాంక్ బండ్, లోయర్ ట్యాంక్ బండ్, లిబర్టీ, నారాయణ గూడ, బషీర్ బాగ్, లకిడికపూల్, హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ రోజు వర్కింగ్ డే కావడంతో ప్రభుత్వ, ప్రైవేటు, కళాశాలలకు, కార్యాలయాలకు వివిధ పనులపై వెళ్లే వాహనదారులు ట్రాఫిక్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాహనాలను క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. మరోపక్క నారాయణ గూడ, హిమాయత్ నగర్, లిబర్టీ మీదుగా గణనాథులు సాగర్ వైపు భారీగా తరలి వెళ్తున్నాయి.  

ABOUT THE AUTHOR

...view details