తెలంగాణ

telangana

Pratidwani వసతిగృహాల్లో చాలీ చాలని వసతి

By

Published : Nov 19, 2022, 8:47 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

Pratidwani రాష్ట్ర వ్యాప్తంగా వసతిగృహాల్లో విద్యార్థులు సమస్యలతో యుద్ధం చేస్తున్నారు. ఏటేటా కళాశాలల్లో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతిగృహాల సామర్థ్యాలు పెరగడం లేదు. ఇంటర్‌ తర్వాత ఉన్నత విద్య కోసం గ్రామాల నుంచి నగరాలు, పట్టణాల బాట పడుతున్న విద్యార్థులకు వసతి సౌకర్యం ప్రధాన సమస్యగా మారింది. దీంతో శ్రద్ధగా చుదువుకుందామని వచ్చిన విద్యార్థులు... కనీస వసతులు, సౌకర్యాల సాధన కోసం ఉద్యమాల వైపు అడుగులు వేస్తున్నారు. తమ చదువులు సజావుగా కొనసాగాలంటే... వసతిగృహాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిందేనంటున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు అందుబాటులో ఉన్న వసతిగృహాలు ఎన్ని? వాటిలో కల్పిస్తున్న సౌకర్యాలేంటి? విద్యార్థులు ఎందుకు ఆందోళన బాట పడుతున్నారనే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.
Last Updated :Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details