తెలంగాణ

telangana

Etela Rajender Inspected Double Bedroom Houses : 'డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రభుత్వం నాసిరకంగా నిర్మిస్తోంది'

By

Published : Aug 10, 2023, 5:21 PM IST

Etela Rajender inspected double bedroom houses

Etela Rajender Inspected Double Bedroom Houses : రాష్ట్రంలో రెండు పడక గదుల ఇళ్లను ప్రభుత్వం నాసిరకంగా నిర్మిస్తోందని.. బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లను ఆయన పరిశీలించారు. ఇక్కడ 500 ఇళ్లు నిర్మిస్తుంటే.. 2,000 మంది దరఖాస్తులు చేసుకున్నారని ఈటల వివరించారు. కేసీఆర్‌ సర్కార్‌.. 35,000 ఇళ్లు మాత్రమే పంపిణీ చేసిందని ఈటల రాజేందర్ విమర్శించారు.

తెలంగాణ సర్కార్ ఇప్పటికి వరకు ఎన్ని ఇళ్లు మంజూరు చేశారో.. దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కేంద్రం ప్రభుత్వం 91,000 ఇళ్లు ఇచ్చిందని తెలిపారు. హడ్కో ద్వారా రూ.9,000 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో కేంద్రం మూడున్నర కోట్ల ఇళ్లను నిర్మాణం చేసి ఇచ్చిందని చెప్పారు. బీజేపీకి అధికారమిస్తే పేదల సొంతింటి కల నెరవేరుస్తామని ప్రజలకు ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు.  

ABOUT THE AUTHOR

...view details