తెలంగాణ

telangana

దోపిడీ దొంగల మంచి మనసు!.. దోచుకునేందుకు వచ్చి.. తిరిగి రూ.100 ఇచ్చి..

By

Published : Jun 26, 2023, 9:17 AM IST

Updated : Jun 26, 2023, 10:23 AM IST

Delhi theft news

దేశ రాజధాని దిల్లీలో రోడ్డుపై నడిచి వెళుతున్న ఓ జంటను దోచుకునే ఆలోచనతో ఇద్దరు వ్యక్తులు అడ్డగించారు. మద్యం మత్తులో తూగుతూ తుపాకీతో బెదిరించి వారిద్దరినీ తనిఖీ చేశారు. ఆ జంట వద్ద కేవలం రూ.20 మాత్రమే ఉండటం చూసి.. మనసు కరిగింది కాబోలు. పైగా ఆ మహిళ ఒంటిపై ఉన్న ఆభరణాలు కూడా రోల్డ్ గోల్డ్​వేనని గుర్తించారు. దీంతో దొంగలే వారికి రూ.100 ఇచ్చి అక్కడినుంచి బైక్​పై వెళ్లిపోయారు. బుధవారం అర్ధరాత్రి వేళ ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 200కు పైగా సీసీటీవీ ఫుటేజీలను గమనించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి తుపాకీ, ద్విచక్ర వాహనం, 30 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితుల్లో ఒకరు జీఎస్టీ అకౌంటెంట్‌ కాగా.. మరొకరు ఓ ప్రైవేట్‌ కంపెనీ ఉద్యోగిగా గుర్తించారు. వీరిద్దరూ పలు ప్రాంతాల్లో ఈ విధమైన దోపిడీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు.

Last Updated : Jun 26, 2023, 10:23 AM IST

ABOUT THE AUTHOR

...view details