తెలంగాణ

telangana

ఆడుకుంటున్న చిన్నారిపై నుంచి వెళ్లిన కారు- ఆస్పత్రికి తరలించేలోపే మృతి

By ETV Bharat Telugu Team

Published : Dec 27, 2023, 3:35 PM IST

Child Dead Car Crash

Child Dead Car Crash : కర్ణాటక బీదర్​లో హృదయ విదారక ఘటన జరిగింది. రోడ్డు పక్కన ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారి పైనుంచి ఓ కారు వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు చిన్నారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్నారి అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటన హరోగరి ప్రాంతంలో మంగళవారం జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

చిన్నారి పైనుంచి వెళ్లిన కారు
ఇటీవలె కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ ఇలాంటి ఘటన జరిగింది. ఓ అపార్ట్​మెంట్​ ఎదురుగా ఆడుకుంటున్న చిన్నారిపై నుంచి కారు దూసుకెళ్లింది. ఆ తర్వాత చిన్నారిని ఏడవడాన్ని గమనించిన తల్లిదండ్రులు గేటులో ఇరుక్కుపోయి ఏడుస్తోందని భావించారు. ఆ తర్వాత సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, చిన్నారి భుజం విరిగిపోయిందని చెప్పారు. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మరణించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details