తెలంగాణ

telangana

CBI Former Director Nageswara Rao on CBN Arrest గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం చట్టవిరుద్ధం: సీబీఐ మాజీ డైరెక్టర్

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2023, 5:44 PM IST

CBI Former Director Nageswara Rao on CBN Arrest

CBI Former Director Nageswara Rao on CBN Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అక్రమమని, చట్టవిరుద్ధమని.. సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. గవర్నర్ అనుమతి లేకుండా అరెస్టు చేయడం.. దర్యాప్తు చేపట్టడం సైతం చట్టవిరుద్ధమని అన్నారు. ఏ.సీ.బీ చట్టంలోని 17A(C) సెక్షన్ ప్రకారం గవర్నర్ అనుమతి తప్పనిసరి అని నాగేశ్వరరావు తెలిపారు. గవర్నర్ అనుమతి తీసుకున్నారా లేదా అనేదానిపై స్పష్టత లేదన్న సీబీఐ మాజీ డైరెక్టర్.. గవర్నర్ అనుమతిస్తే ఆ పత్రాలు ఇవ్వాలని దర్యాప్తు అధికారులను అడగాలని సూచించారు. గవర్నర్ అనుమతి తీసుకోకుంటే దర్యాప్తు చెల్లుబాటు కాదని అన్నారు. గవర్నర్ అనుమతి లేకుండా అదుపులోకి తీసుకుంటే అది అక్రమ నిర్బంధం అవుతుందని అన్నారు. అక్రమంగా నిర్భంధించిన అధికారులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని.. అధికారులు తప్పు చేస్తే ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవచ్చన్నారు. ప్రజాప్రతినిధులపై నేరుగా నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదని సీబీఐ మాజీ డైరెక్టర్ తెలిపారు. తప్పనిసరిగా గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందేనన్నారు. 

ABOUT THE AUTHOR

...view details