తెలంగాణ

telangana

Campaign Against BRS MLA Diwakar Rao : 'నువ్వు వద్దు-నీ నోటు వద్దు' .. ఎమ్మెల్యే దివాకర్ రావుకు వ్యతిరేకంగా ప్రచారం

By ETV Bharat Telangana Team

Published : Oct 10, 2023, 2:19 PM IST

Two youth campaign against MLA Diwakar Rao

Campaign Against BRS MLA Diwakar Rao : మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావుకు వ్యతిరేకంగా ఇద్దరు యువకులు ప్రచారం చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ.. మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నడిపెల్లి దివాకర్ రావును ప్రకటించింది. నియోజకవర్గంలో గెలుపు కోసం దివాకర్ రావు గ్రామాల్లో తిరుగుతూ తొమ్మిదేళ్లుగా రాష్ట్రానికి బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ.. మళ్లీ తనకు ఓటు చేస్తే ఏం చేస్తానని విషయంలో హామీలు ఇస్తున్నారు. 

ఈ నేపథ్యంలో మంచిర్యాల పట్టణంలోని హమాలివాడకు చెందిన సురేశ్, మరొక యువకుడు కలిసి ఫ్లెక్సీ పై 'నువ్వు వద్దు-నీ నోటు వద్దు' అని ఓ ఫ్లెక్సీ ముద్రించి మైక్​తో ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా తమ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశారంటూ ప్రశ్నించారు. జిల్లా గ్రంథాలయంలో జరిగిన అవినీతిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఫ్లెక్సీ, సౌండ్ బాక్స్​లను స్వాధీనం చేసుకొని ప్రచారం చేస్తున్న ఇరువురుని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details