తెలంగాణ

telangana

Building Collapse Viral Video : ఒక్కసారిగా కుప్పకూలిన బిల్డింగ్​.. అక్కడే ఉన్న బైకర్​తోపాటు విద్యార్థి..

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2023, 5:11 PM IST

Etv Building Collapse Viral Video

Building Collapse Viral Video : ఉత్తర్​ప్రదేశ్​లోని మథురలో శిథిలావస్థలో ఉన్న రెండంతస్తుల భవనం ఒక్కసారా కుప్పకూలిపోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ బైకర్​తో మరో వ్యక్తిపై భవన శిథిలాలు పడ్డాయి. దీంతో వారు తీవ్రగాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు.. స్థానికంగా ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం అవి సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

గోవింద్​నగర్​లో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. భవనం ఒక్కసారిగా కుప్పకూలడం వల్ల స్కూటీ నడుపుతున్న వ్యక్తితో పాటు ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్పించారు. మొత్తం వ్యవహారంపై విచారణ జరుపుతామని చెప్పారు.

ఈ ఘటనపై గోవింద్​నగర్​ పోలీస్ అధికారి లలిత్​ భాటి మాట్లాడారు. "నగరంలోని వార్డ్​ నెం.58లో శిథిలావస్థలో ఉన్న ఇల్లు అకస్మాత్తుగా కూలిపోయింది. దీని కారణంగా ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు"అని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details