తెలంగాణ

telangana

'తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు'

By ETV Bharat Telangana Team

Published : Dec 14, 2023, 9:11 PM IST

BJP MLA Raja Singh About Sabarimala

BJP MLA Raja Singh About Sabarimala : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి శబరిమలకి వెళ్లే లక్షలాది మంది అయ్యప్పస్వాములు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తెలిపారు. తాగునీరు, పార్కింగ్ సదుపాయం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. స్వాములుకు అన్నప్రసాదం చేద్దామన్నా కేరళ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​తో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర సీఎం, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో మాట్లాడి భోజన వసతి, తాగునీరు సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.  

Raja Singh about Ayyappa Swamy Devotees : దిల్లీ తరహాలో కేరళలో కూడా తెలంగాణ భవన్​ను ఏర్పాటు చేయాలని రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు. ఐదు నుంచి పదిహేను ఎకరాల స్థలం తీసుకొని తెలంగాణ భవన్‌ నిర్మిస్తే అక్కడ స్వాములు బస చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. కేరళ ప్రభుత్వం హిందూ వ్యతిరేకమైందని, అయ్యప్ప స్వాములను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి వెళ్లిన స్వాములకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.

ABOUT THE AUTHOR

...view details