తెలంగాణ

telangana

Amit Shah visitig Bhadrachalam tomorrow : రేపు భద్రాద్రి రామయ్యను దర్శించుకోనున్న అమిత్​షా...

By ETV Bharat Telangana Team

Published : Aug 26, 2023, 4:01 PM IST

Amit Shah visitig Bhadrachalam tomorrow

 Amit Shah visitig Bhadrachalam tomorrow : భద్రాద్రిలో రేపు కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో దిల్లీ నుంచి ప్రత్యేక బృందం భద్రాచలం చేరుకుంది. హెలికాప్టర్ నుంచి ముందుగా బూర్గంపాడు మండలం సారపాక లోని ఐటీసీ గెస్ట్ హౌస్ వద్దకు అమిత్ షా చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా సారపాక నుంచి భద్రాచలం వెళ్లి భద్రాద్రి రామయ్యను దర్శించుకోనున్నారు. సారపాకలో ఆదివారం జరిగే సంతను, దుకాణాలన్నింటినీ రేపు మూసివేయాలని అక్కడి పోలీసులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో భద్రాద్రి ఆలయంలో పనిచేస్తున్న అర్చకులు సిబ్బంది మొత్తం 17 మంది మాత్రమే ఆలయ పరిసరాల్లో ఉండేలా కార్యాచరణ చేపడుతున్నారు.  సారపాక చేరుకున్న దగ్గరనుంచి ఆలయంలో పూజలు పూర్తయ్యేంతవరకు మొత్తం 40 నిమిషాల సమయాన్ని అమిత్ షా పర్యటన కోసం కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందాలు అమిత్ షా పర్యటన కోసం భద్రతాపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details