తెలంగాణ

telangana

ఇన్నర్ రింగ్ రోడ్డు, మద్యం కేసు - చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

By ETV Bharat Telugu Team

Published : Nov 23, 2023, 3:55 PM IST

Updated : Nov 23, 2023, 5:06 PM IST

hc_hearing_on_cbn_anticipatory_bail_petition

HC Hearing on CBN IRR Anticipatory Bail Petition: ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసుకు సంబంధించి.. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం (హైకోర్ట్) విచారణ జరిపింది. విచారణలో భాగంగా చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. అనంతరం తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది. రేపటి (శుక్రవారం) విచారణలో సీఐడీ తరఫు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించనున్నారు.

CBN Anticipatory Bail Petition Hearing Postponed: రాజధాని నగరానికి సంబంధించిన బృహత్‌ ప్రణాళిక డిజైనింగ్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, దాన్ని అనుసంధానించే రహదారుల ఎలైన్‌మెంట్‌లో అక్రమాలు చోటు చేసుకున్నాయని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2022 ఏప్రిల్‌ 27న సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు ఆధారంగా అదే ఏడాది మే 9వ తేదీన సీఐడీ అధికారులు పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో చంద్రబాబును మొదటి నిందితుడిగా సీఐడీ పేర్కొంది. దాంతో ఈ కేసులో తనకు బెయిలు మంజూరు చేయాలని చంద్రబాబు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

మద్యం కేసులో చంద్రబాబు ముందుస్తు బెయిల్‌ పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. 

Last Updated : Nov 23, 2023, 5:06 PM IST

ABOUT THE AUTHOR

...view details