తెలంగాణ

telangana

గ్రాండ్​గా నటి హన్సిక పెళ్లి డ్యాన్స్​తో నూతన వధూవరుల సందడి

By

Published : Dec 5, 2022, 10:49 AM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

నటి హన్సిక వివాహం ఘనంగా జరిగింది. తన ప్రియుడు, వ్యాపార భాగస్వామి సోహైల్‌తో ఆమె ఏడడుగులు వేశారు. జైపుర్‌లోని రాజకోట వేదికగా ఆదివారం రాత్రి సింధి సంప్రదాయంలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబసభ్యులు, సన్నిహితులు ఈ వేడుకలో పాల్గొని నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అలానే ఈ వేడుకలో నూతన వధూవరులిద్దరూ కలిసి చిందులేస్తూ సందడి చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details