తెలంగాణ

telangana

'కోహ్లీ కోసం తూటానైనా ఎదుర్కొనేవాడిని.. నా లక్ష్యం అదే'

By

Published : Oct 26, 2022, 6:48 AM IST

విరాట్ కోహ్లీని ఔట్ కానివ్వకుండా ఉండేందుకు తాను తూటానైనా ఎదుర్కొనేవాడినని టీమ్ఇండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య చెప్పుకొచ్చాడు. ఒత్తిడిని ఎదుర్కోవడంలో కోహ్లీ కంటే సమర్థుడు మరొకరు లేరని పొగిడాడు.

HARDIK VIRAT
HARDIK VIRAT

పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి కోసం తూటానైనా ఎదుర్కొనేవాడినని టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య అన్నాడు. "ప్రస్తుత టీమ్‌ఇండియాతో అనుబంధం చిరస్మరణీయం. ఈ బృందంతో సమయాన్ని ఎప్పటికీ ఆస్వాదిస్తా. బ్యాటింగ్‌ కోసం మైదానంలో అడుగుపెట్టినప్పుడు నీ (కోహ్లి) కోసం తూటాను ఎదుర్కోడానికైనా సిద్ధంగా ఉన్నా. ఆ సమయంలో నిన్ను ఔట్‌ కానివ్వదల్చుకోలేదు. అదే నా లక్ష్యం. ఎన్నో ఏళ్లుగా కీలక మ్యాచ్‌ల్లో చాలాసార్లు ఇలా ఆడావు. ఒత్తిడిని ఎదుర్కోవడంలో నీకంటే సమర్థుడు ఎవరూ లేరు" అని కోహ్లీని ఉద్దేశిస్తూ హార్దిక్‌ పేర్కొన్నాడు. కోహ్లి బాదిన రెండు సిక్సర్లు అతను మాత్రమే కొట్టగలడని తెలిపాడు.

"నేను చాలా సిక్సర్లు కొట్టా. కాని కోహ్లి కొట్టిన ఆ రెండు సిక్సర్లు ఎంతో ప్రత్యేకం. నా హృదయంలో వాటిది ప్రత్యేకమైన స్థానం. ఆ సిక్సర్లు ఎంత ప్రత్యేకమో మా ఇద్దరికి తెలుసు. నేనెంతో క్రికెట్‌ ఆడా. కోహ్లి తప్ప మరెవరూ ఆ సిక్సర్లు కొట్టలేరు. ఆ ఇన్నింగ్స్‌లో మేమిద్దరం చాలా కష్టపడ్డాం. సునాయాసంగా గెలిచివుంటే ఇంత ప్రత్యేకం కాకపోయేది. మ్యాచ్‌కు ముందు జట్టులో చాలా ఒత్తిడి గమనించా. పెద్ద మ్యాచ్‌ల్లో చాలామంది ఒత్తిడిలో ఉంటారు. మేమంతా కలిసికట్టుగా ఎంతో కష్టపడ్డాం. ఒకరికొకరం అండగా ఉన్నాం. కాని నాలో ఎలాంటి భావోద్వేగాలు లేవు. మైదానంలో అడుగుపెట్టినప్పుడు సంతోషంగా ఉన్నా. ద్రవిడ్‌ సర్‌తో మాట్లాడినప్పుడు "ప్రశాంతంగా ఉండు" అని అన్నాడు. సర్‌, ఇక్కడ ఉన్నందుకు నేనెంతో ఆనందంగా ఉన్నానని అర్థం చేసుకోండి. 10 నెలల క్రితం గాయం నుంచి కోలుకునేందుకు ఎంతో శ్రమించాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నా.అని ద్రవిడ్‌ సర్‌కు చెప్పా" అని హార్దిక్‌ వివరించాడు.

ABOUT THE AUTHOR

...view details