తెలంగాణ

telangana

వైవాహిక జీవితంలో శృంగారం తప్పనిసరా?

By

Published : Sep 28, 2021, 10:21 AM IST

భార్యాభర్తల వైవాహిక జీవనానికి లైంగిక సంబంధం (Sex In Relationships) ఎంతో ముఖ్యం. ఇది సరిగ్గా ఉంటే ఇతర వ్యవహారాలు సక్రమంగా సాగుతాయి. అందుకే పెళ్లి అయిన కొత్తల్లో వధూవరులు మధ్య అంతులేని ప్రేమాభిమానాలు ఉంటాయి. అయితే అలాంటి ప్రేమాభిమానాలే కొంతకాలం గడిచిన తర్వాత తగ్గుముఖం పడుతాయి. ఆ సమయంలో వారి మధ్య కలహాలు రావడం ప్రారంభమవుతుంది. అయితే ఆ సమయం వారి మధ్య శృంగారం తప్పనిసరా? కాదా? అనేది తెలుసుకుందాం.

Sex Is So Important in Happy Marriages
వైవాహిక జీవితంలో శృంగారం

భార్యాభర్తలు సంసార సుఖాన్ని (Sex In Relationships) అనుభవిస్తున్న కాలం ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఒకరిపై ఒకరికి చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. అయితే పిల్లలు పుట్టిన తర్వాత లైంగిక సంబంధం కొద్దికొద్దిగా తగ్గిపోతుంది. సెక్స్ పట్ల ఇద్దరికీ ఆసక్తి ఉండదు. అంతేకాదు కొన్ని రకాలైన వ్యాధులు, దీర్ఘకాలిక రోగాలు కూడా వేధిస్తుంటాయి. ఇలాంటప్పుడే ఇద్దరి మధ్యన సఖ్యత చెడిపోతుంది. అన్యోన్యంగా ఉండే దాంపత్యంలో ఒడిదొడుకులు వస్తుంటాయి. కొంతమంది ఆడవారికి నిద్రలేమి, సర్వేకల్​ క్యాన్సర్​, పీరియడ్స్ ఆగిపోవడం జరుగుతుంది. అలాంటి భాగస్వామితో రతిలో పాల్గొనాలి అంటే భర్తకు భయం వేస్తుంటుంది. మరి దీనిని అధిగమించడం ఎలా అనేది తెలుసుకుందాం.

భార్యభర్తల మధ్య లైంగిక సంబంధం లేకపోతే అన్యోన్యత ఉంటుందా?

దంపతుల మధ్య సఖ్యత ఉండాలి అంటే కచ్చితంగా లైంగిక సంబంధం ఉండాలి. వివాహం అంటేనే లైంగిక సంబంధం(Sex In Relationships). అది లేకపోతే స్నేహం అవుతుంది. అందుకే ఇద్దరి మధ్య సెక్స్ అనేది జరిగితే బంధం మరింత బలపడుతుంది. ఎవరైతే రోజూ రతిలో పాల్గొంటారో వారి మధ్య చక్కని అనురాగం ఉంటుంది.

నిద్రలో ఉన్న స్త్రీతో రమిస్తే ఆమెకు నరాల బలహీనత వస్తుందా?

సెక్స్ అనేది మధురానుభూతిని అనుభవించడం కోసం చేసేది. భార్య నిద్రపోతుంటుంది. భర్త లేటుగా వచ్చి పని ముంగించేసుకొని పోతే అందులో ఆనందం ఏం ఉంటుంది. అది అసంపూర్ణమైన అనుభూతి. అందుకే ఇద్దరు చక్కగా ఫోర్​ప్లే చేసుకొని, రొమాంటిక్ కబుర్లు చెప్పుకొని ఆస్వాదిస్తా చేస్తే.. అప్పుడు దానికి ఓ అర్థం ఉంటుంది. నిద్రపోతున్న భార్యతో సెక్స్​ చేయడం వల్ల ఆమెకు ఏం కాదు. నరాల బలహీనత అసలు రాదు. రోజూ రతిలో పాల్గొనే వారిలో ఆరోగ్యం చాలా బాగుంటుంది.

  • భార్యకు సర్వేకల్​ క్యాన్సర్​ ఉంటే.. సెక్స్ చేసిన భర్తకు కూడా క్యాన్సర్​ వచ్చే అవకాశం ఉందా?
  • బ్లెడ్​ గ్రూప్​లు వేరు అయితే సెక్స్​లో తృప్తి ఉంటుందా?
  • పీరియడ్స్​లో ఉన్న మహిళలో సెక్స్​ కోరికలు ఉంటాయా? ఉండవా?
  • థైరాయిడ్​ వ్యాధి అంటువ్యాధా? ఈ వ్యాధి ఉన్న మహిళ వక్షోజాలు చూషించడం, వారి అధరాల మీద చుంబించడం వల్ల థైరాయిడ్ వస్తుందా?
  • సెక్స్​లో ప్రేరణ పొందడం ఎలా? దాని కోసం ఏం చేయాలి?
  • మోనోపాజ్​ వచ్చిన స్త్రీతో పెళ్లికాని వారు సెక్స్​లో పాల్గొనవచ్చా?
  • పురుషాంగం వంకరగా ఉంటే పెళ్లికి పనికి వస్తారా?
  • బీర్జాలు సాగి ఉంటే సెక్స్​లో పాల్గొనడానికి ఏమైన ఇబ్బంది ఉంటుందా?
  • మద్యం తీసుకుంటే సెక్స్​కు పనికిరారా?
  • పై ప్రశ్నలకు సమాధాలు కావాలంటే కింద ఉన్న వీడియోను చివరి వరకు చూడండి.

ఇది చూడండి:Desire In Ladies: ఆ విషయమై స్త్రీలలో ఆసక్తి కలిగించడం ఎలా?

ABOUT THE AUTHOR

...view details