Desire In Ladies: ఆ విషయమై స్త్రీలలో ఆసక్తి కలిగించడం ఎలా?

author img

By

Published : Sep 25, 2021, 4:16 PM IST

Desire In Ladies

యవ్వనంలోకి అడుగుపెట్టిన స్త్రీలలో సాధారణంగానే కోరికలు (Desire In Ladies) ఎక్కువ ఉంటాయి! దీంతో రతిలో పాల్గొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు! కానీ కొంతమందిలో వివిధ కారణాలతో ఆ భావనలు సన్నగిల్లుతాయి. అాలాంటి వారితో శృంగారం భాగస్వామికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయితే వారిలో ఉండే కామనాడులను ప్రేరేపించి..ఆసక్తి కలిగించవచ్చని అంటున్నారు నిపుణులు.

స్త్రీ, పురుషులకు యవ్వనంలోకి అడుగుపెట్టగానే శృంగార కోరికలు (Desire In Ladies) ఎక్కువ అవుతాయి. ఎప్పుడెప్పుడు రతిలో పాల్గొందామా అని ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. కామదాహాన్ని తీర్చుకొనేందుకు తహతహలాడిపోతుంటారు. ఇదే సమయంలో వారిని కొన్ని ఆలోచనలు సతమతం చేస్తుంటాయి. ముఖ్యంగా స్త్రీలలో అయితే వక్షోజాలు చిన్నగా ఉన్నాయని.. పురుషుల్లో అయితే వృషణాలు చిన్నగా లేక పెద్దగా ఉన్నాయని.. దీంతో సెక్స్​లో ఆ థ్రిల్​ ఉంటుందో లేదో అని అనుమానం పడుతుంటారు. ఇదే సమయంలో రతిలో పాల్గొంటే ఎలాంటి టెక్నిక్స్​ వాడాలి? ఎలా తృప్తి చెందాలో అని సందేహిస్తుంటారు. అసలు సెక్స్​లో ఆకాశాన్ని అంటే ఆనందాన్ని అనుభవించడం ఎలా? ఎలా చేస్తే స్త్రీల్లో ఆ కోరికలు బాగా పెరుగుతాయి?

రతిలో పురుషాంగం గర్భాశయానికి తాకితేనే స్త్రీ తృప్తి చెందుతుందా?

శృంగారంలో పాల్గొన్నప్పుడు ఇరువురు తృప్తి చెందాలి. అప్పుడే వారి మధ్య బంధం గట్టిగా ఉంటుంది. అలా అని భాగస్వామి గర్భాశయానికి పురుషాంగం తగిలేలా రతి చేస్తే.. స్త్రీలు తృప్తి చెందుతారు అనేది కేవలం అపోహా. అలా చేసేటప్పుడు నిజానికి పురుషాంగం అక్కడ తగలడం అనేది ఉండదు. ఇది ప్రవేశించే మార్గం కిందకు ఉంటుంది. అందులోను స్త్రీ గర్భాశయం దగ్గర కామనాడులు ఉండవు కాబట్టి.. అక్కడ తగిలితే భావప్రాప్తి పొందే అవకాశం ఉండదు.

కొందరు స్త్రీలకు రతిలో పాల్గొనాలనే ఆసక్తి ఉండదు.. కారణం ఏంటి?

దీనికి గల మొదటి కారణం వారిని పెంచే విధానం. ఇంట్లో శృంగారం గురించి మాట్లాడేటప్పుడు వారిని తప్పుపడుతారు. ఆడపిల్లలు దాని గురించి ఆలోచించకూడదని అంటారు. సెక్స్​ అంటే నీచం అని, బూతు అని చిన్నప్పటి నుంచి నేర్చిస్తారు. దీంతో వారికి రతి మీద పెద్దగా ఆలోచన ఉండదు. కాబట్టి రతిలో పాల్గొనేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. అంతేకాకుండా స్త్రీలకు పెళ్లి అయిన తరువాత వారిలో కోరికలు బలంగా ఉంటాయి. భర్త అలా చేయాలి.. ఇలా చేయాలి.. ఎత్తుకోవాలి.. ముద్దు పెట్టాలి ఇలాంటి భావనలు ఉంటాయి. ఇటువంటప్పుడు ఆ స్థాయిని భర్త అందుకోలేకపోతే వారిలో ఒక విధమైన నిరాశ పురుడు పోసుకుంటుంది. సెక్స్ అంటే ఇంతేనా? నేను ఏదో అనుకున్నా.. ఏం లేదు అని బాధపడుతారు. ఈ కారణంగా వారిలో కోరికలను చంపేసుకుంటారు.

  • వృషణాలు ఎక్కువ కనిపించే మగవారిలో సెక్స్​ సామర్థ్యం ఎక్కువగా ఉంటుందా?
  • పోలిసిస్టిక్​ ఒవేరి సిండ్రోమ్​ ఉన్న వారిలో స్థూలకాయం ఎక్కువ ఉండడానికి కారణం ఏంటి?
  • మన కన్న పెద్దవారితో రతిలో పాల్గొనడం వల్ల నరాల బలహీనత అనేది వస్తుందా? పిల్లలు పుట్టే అవకాశం ఉండదా?
  • టీబీ జబ్బు ఉన్న వారు సెక్స్​ చేయవచ్చా? చేస్తే భాగస్వామికి ఏమైనా ఇబ్బందా?
  • రతిలో పాల్గొన్నప్పుడు పొత్తకడుపులో నొప్పివస్తే ఏం చేయాలి? స్ట్రోక్స్​ను తగ్గించాల్సిన అవసరం ఉందా?
  • టెస్టోస్టిరాన్​ హార్మోన్​ తగ్గడం వల్ల సెక్స్​ సమస్యలు వస్తాయా?
  • వయసు పెరిగిన వారిలో ప్రోస్టేట్​ గంథ్రి పెద్దదవుతుందా? దాని వల్ల మూత్రం బిగపట్టి పోయాల్సి వస్తుందా? ఆడవారిలో కూడా ఇది ఉంటుందా?
  • భాగస్వామికి షుగర్​ ఉంటే.. మన జననాంగాల్లో పుండుగా మారి బాధ ఉంటుందా?

పై ప్రశ్నలకు సమాధాలు కావాలంటే కింద ఇచ్చిన వీడియోను చూడండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: జీ-స్పాట్​ అంటే ఏంటి.. భావప్రాప్తిలో దాని పాత్రేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.