తెలంగాణ

telangana

వైభవంగా అధ్యయనోత్సవాలు.. వటపత్రశాయి అలంకరణలో యాదాద్రీశుడు

By

Published : Jan 17, 2022, 5:06 PM IST

Yadadri Adhyanotsavalu: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఐదో రోజు అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రోజుకో రూపంలో దర్శనమిస్తున్న స్వామి వారు.. నేడు వటపత్రశాయి అలంకారంలో భక్తులకు కనువిందు చేశారు. స్వామి వారి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం కోసం ప్రముఖ వ్యాపారవేత్త బండారి శ్రీనివాస్​.. రూ. 50 లక్షల విరాళం అందజేశారు.

yadadri
యాదాద్రి అధ్యయనోత్సవాలు

Yadadri Adhyanotsavalu: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి నారసింహుని సన్నిధిలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈనెల 13 న ప్రారంభమైన అధ్యయనోత్సవాలు.. 18 వ తేదీ వరకు జరగనున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా నేడు స్వామి వారు వటపత్రశాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వజ్రవైఢూర్యాలు, వివిధ రకాల పుష్పాలతో ఆలయ అర్చకులు.. శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని చూడముచ్చటగా అలంకరించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణలు, ప్రత్యేక పూజలతో ఐదోరోజు ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అధ్యయనోత్సవాలు జరుగుతుండటంతో ఈ ఆరు రోజులు మొక్కు కల్యాణం, శాశ్వత కల్యాణం, సుదర్శన నారసింహ హోమం సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు.

వటపత్రశాయి అలంకరణలో స్వామివారు

రూ. 50 లక్షల విరాళం

Gold donation for yadadri: స్వామి వారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా విమానం గోపురానికి బంగారం తాపడం కోసం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్​లోని గుడి మల్కాపూర్ కార్వాన్ ప్రాంతానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బండారి శ్రీనివాస్​.. రూ. 50 లక్షల విరాళాన్ని డీడీల రూపంలో అందజేశారు. డీడీలను ఆలయ ఈవో గీతకు అందజేశారు. కుటుంబ సమేతంగా యాదాద్రి ఆలయాన్ని సందర్శించిన ఆయన.. బాలాలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బండారి కుటుంబానికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేశారు.

స్వర్ణ విమాన గోపురానికి విరాళం అందజేస్తున్న బండారి శ్రీనివాస్​

ఇదీ చదవండి:కొత్తల్లుడికి విందు అదుర్స్​.. గోదారోళ్ల మర్యాదలంటే తగ్గేదే లే.!

ABOUT THE AUTHOR

...view details