తెలంగాణ

telangana

రైతు వేదిక నిర్మాణాలను 10రోజుల్లో పూర్తి చేయాలి: కలెక్టర్​

By

Published : Oct 11, 2020, 6:55 PM IST

వలిగొండ మండలంలోని పలు గ్రామాల్లో రైతు వేదిక పనులను యాదాద్రి భువనగిరి జిల్లా పాలనాధికారి పరిశీలించారు. నిర్మాణాలను 10రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

yadadri bhuvanagiri district collector inspected farmer platform works
రైతు వేదిక నిర్మాణాలను 10రోజుల్లో పూర్తి చేయాలి: కలెక్టర్​

రైతు వేదిక నిర్మాణాలను వివిధ విభాగాల అధికారుల సమన్వయంతో 10రోజుల్లో పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ సూచించారు. వలిగొండ మండలం వెల్వర్తి, రెడ్ల రేపాకలో నిర్మాణంలో ఉన్న రైతు వేదిక పనులను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
నిర్మాణ పనులను కాంట్రాక్టర్లు వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వెల్వర్తి గ్రామంలో వ్యవసాయేతర ఆస్తుల వివరాల నమోదు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details