తెలంగాణ

telangana

'ఆరోగ్య భారత్'​ లక్ష్యంగా ఫిట్​ ఇండియా ఆధ్వర్యంలో 5కె రన్​

By

Published : Jan 15, 2021, 11:11 AM IST

జాతీయ సైనిక దినోత్సవం సందర్భంగా ఫిట్​ ఇండియా ఫౌండేషన్​ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో 5కె రన్​ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్​ కళాశాల వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. మనిషి జీవితంలో వ్యాయామం, యోగాను భాగంగా చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటామని ఫౌండేషన్​ రాష్ట్ర, జిల్లా సభ్యులు పేర్కొన్నారు.

fit india,  5k run in bhuvanagiri government college
భువనగిరి ప్రభుత్వ కళాశాలలో 5కె రన్​, ఫిట్​ ఇండియా

జాతీయ సైనిక దినోత్సవం, యూపీ మాజీ సీఎం మాయావతి పుట్టినరోజు సందర్భంగా ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 5కె రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఫిట్ ఇండియా ఫౌండేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రుద్రవరం అనిల్ స్వేరో, జిల్లా సలహాదారుడు బొల్లెడ్ల నరేష్ స్వేరో ప్రారంభించారు.

ఆరోగ్యమే మహాభాగ్యం

మనం ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ వ్యాయామం చేయాలని అనిల్ పేర్కొన్నారు. భగవంతుడిని మొక్కితే వందేళ్లు బతుకుతామో లేదో తెలియదు కానీ.. ఫిట్ ఇండియాతో మాత్రం ఆరోగ్యంగా జీవించగలమని ధీమా వ్యక్తం చేశారు. ఆరోగ్య భారత్ లక్ష్యంగా సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఫౌండేషన్ కృషి చేస్తోందని జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల రమేష్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని జిల్లా ఉపాధ్యక్షుడు తలారి గణేష్ సూచించారు. మనతో పాటు ఇతరులు కూడా ఆరోగ్యంగా ఉండేలా వారిని ప్రోత్సహించాలని తెలిపారు. మతం, ప్రాంతం, వర్గ భేదాలతో సంబంధం లేకుండా ఫిట్ ఇండియా ఫౌండేషన్ కృషి చేస్తోందని వెల్లడించారు.

ఇదీ చదవండి:సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఆర్మీ దినోత్సవం

ABOUT THE AUTHOR

...view details