తెలంగాణ

telangana

ఆ హోటల్​లో ఏవి చూసినా దేశభక్తి ఉప్పొంగాల్సిందే

By

Published : Aug 16, 2022, 4:55 PM IST

tiffins in tricolour దేశభక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే ఆ ప్రేమను ఒక్కొక్కరు ఒక్కోలా చాటుకుంటుంటారు. హనుమకొండలోని ఓ హోటల్​ నిర్వాహకుడు తన దేశభక్తిని వినూత్నంగా చాటుకున్నాడు. అంత వినూత్నంగా అతడు ఏం చేశాడంటే..

ఆ హోటల్​లో ఏవి చూసినా దేశభక్తి ఉప్పొంగాల్సిందే
ఆ హోటల్​లో ఏవి చూసినా దేశభక్తి ఉప్పొంగాల్సిందే

tiffins in tricolour హనుమకొండలోని ఓ హోటల్​ నిర్వాహకుడు తన దేశభక్తిని వినూత్నంగా చాటుకున్నాడు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా తన హోటల్​లో లభించే ఆహార పదార్థాలను మూడు రంగులతో తయారు చేయించాడు. క్యారెట్​, పాలకూర ఉపయోగించి ఇడ్లీలు, పూరీలు, దోసెలను జెండా రంగులను తలపించేలా అందుబాటులో ఉంచాడు.

త్రివర్ణ రంగులతో తయారు చేసిన టిఫిన్లు

స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ దేశభక్తిని వినూత్నంగా చాటుకోవాలని ఆహార పదార్థాలను త్రివర్ణ రంగులతో తయారు చేశామని హోటల్​ నిర్వాహకుడు శివకృష్ణ తెలిపారు. నగరవాసులు వీటిని ఆసక్తిగా తిలకిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.

దేశభక్తిని ఒక్కొక్కరు ఒక్కోలా చాటుకుంటారు. మాకు తెలిసిన పని వంట. ఆ వంట భాషలోనే మా దేశభక్తిని చాటుకోవాలని ఇడ్లీలు, పూరీలు, దోసెలను 3 రంగులతో తయారు చేశాం. వీటి పట్ల కస్టమర్ల స్పందన కూడా చాలా బాగుంది.-శివకృష్ణ, హోటల్​ నిర్వాహకుడు

హోటల్​ నిర్వాహకుడు శివకృష్ణ

ఉద్వేగభరితంగా జనగణమన, దేశభక్తితో మురిసిన తెలంగాణ

భారతావని ప్రగతికి ప్రధాని మోదీ పంచ ప్రాణ ప్రతిష్ఠ

ABOUT THE AUTHOR

...view details