తెలంగాణ

telangana

పాఠశాలలు తెరవాలంటూ ప్రైవేట్ ఉపాధ్యాయుల ఆందోళన

By

Published : Apr 1, 2021, 2:15 PM IST

పాఠశాలలు తెరవాలంటూ వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ​లో ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. కరోనా సాకుతో తమ పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

private teachers, private teachers protest
ప్రైవేట్ టీచర్లు, ప్రైవేట్ టీచర్ల ధర్నా, వరంగల్ అర్బన్ జిల్లా వార్తలు

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బడులు తెరిచి.. ఎన్నికలవ్వగానే మళ్లీ మూసివేశారని ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆరోపించారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో కలెక్టరేట్ నుంచి ఏకశిలా పార్కు వరకు ర్యాలీ చేపట్టారు. కరోనా సాకుతో తమ పొట్టకొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికే కరోనా వల్ల జీతాల్లేక అల్లాడుతోంటే.. మళ్లీ ఇప్పుడు పాఠశాలలు మూసివేశారని వాపోయారు. బార్లు, సినిమా హాళ్లు తెరిచి ఉంటే రాని కరోనా బడులు తీస్తే వస్తోందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే పాఠశాలలు తెరవాలని డిమాండ్ చేశారు.

ప్రైవేట్ టీచర్ల ధర్నా

ABOUT THE AUTHOR

...view details