తెలంగాణ

telangana

Raju postmortem: ఎంజీఎం ఆస్పత్రిలో రాజు మృతదేహానికి శవపరీక్ష

By

Published : Sep 16, 2021, 4:48 PM IST

Updated : Sep 16, 2021, 7:00 PM IST

ఎంజీఎం ఆస్పత్రికి రాజు కుటుంబసభ్యులు.. కాసేపట్లో మృతదేహానికి శవపరీక్ష
ఎంజీఎం ఆస్పత్రికి రాజు కుటుంబసభ్యులు.. కాసేపట్లో మృతదేహానికి శవపరీక్ష ()

సైదాబాద్‌ హత్యాచార కేసు నిందితుడు రాజు మృతదేహానికి వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో శవపరీక్ష జరుగుతోంది. ఆస్పత్రికి చేరుకున్న రాజు కుటుంబసభ్యులు... మృతదేహం నిందితుడు రాజుదేనని నిర్ధరించారు.

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్‌ హత్యాచార కేసు నిందితుడు రాజు మృతదేహానికి వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో శవపరీక్ష నిర్వహిస్తున్నారు. ఆస్పత్రికి చేరుకున్న రాజు కుటుంబసభ్యులు... మృతదేహం నిందితుడు రాజుదేనని నిర్ధరించారు. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.

చెప్పులతో దాడి

అంతకుముందు భారీ పోలీసు బందోబస్తు నడుమ మృతదేహాన్ని కాజీపేట రైల్వే సీఐ రామ్మూర్తి ఆధ్వర్యంలో అంబులెన్స్‌లో తరలించారు. మృతదేహం మార్చురీకి చేరుకోగానే పోలీసులు మార్చురీ గేట్లు మూసివేశారు. ఈక్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు మృతదేహాన్ని తరలిస్తున్న అంబులెన్స్‌పై చెప్పులు విసిరారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎంజీఎం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎంజీఎం ఆస్పత్రికి రాజు కుటుంబసభ్యులు.. కాసేపట్లో మృతదేహానికి శవపరీక్ష

ఈరోజు ఉదయం స్టేషన్‌ఘన్‌పూర్‌ సమీపంలో రైల్వే ట్రాక్‌పై రాజు బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. నిందితుడు రాజు ఆత్మహత్యతో హైదరాబాద్‌లో సంబురాలు చేసుకుంటున్నారు. పలు చోట్ల నగరవాసులు టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.

ఇదీ చదవండి: Saidabad Incident: సైదాబాద్ హత్యాచార నిందితుడి మృతదేహం ఎంజీఎంకు తరలింపు

Last Updated :Sep 16, 2021, 7:00 PM IST

ABOUT THE AUTHOR

...view details