తెలంగాణ

telangana

KCR Aerial Survey: 'వరద పరిస్థితిపై నేడు, రేపు సీఎం ఏరియల్‌ సర్వే'

By

Published : Jul 17, 2022, 4:40 AM IST

సీఎం

KCR Aerial Survey: శనివారం రాత్రి హనుమకొండకు చేరుకున్న సీఎం కేసీఆర్ ఆ ప్రాంత మంత్రులు, ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. వరద పరిస్థితులపై సీఎం సమీక్ష నిర్వహించారు. వరదల నష్టం వివరాలపై ఆరా తీశారు. నేడు వరంగల్‌ నుంచి భద్రాచలం వరకు సీఎం ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు.

KCR Aerial Survey: గోదావరి నది పరీవాహక ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈరోజు, రేపు ఏరియల్‌ సర్వే నిర్వహించి, వరద పరిస్థితిని పరిశీలించనున్నారు. రెండు, మూడు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సమీక్ష చేసి.. వరద బాధితులను పరామర్శించనున్నారు. ఇందుకోసం కేసీఆర్‌ శనివారం రాత్రి వరంగల్‌ చేరుకున్నారు. ఆయన వెంట మంత్రి హరీశ్‌రావు, ఎంపీ సంతోష్‌కుమార్‌, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రోడ్లు, భవనాలు, వైద్యఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు.

సీఎం ఈరోజు ఉదయం వరంగల్‌ నుంచి భద్రాచలం వరకు ఏరియల్‌ సర్వే చేస్తారు. భద్రాచలం, ఏటూరునాగారంలలో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో పాల్గొంటారు. మళ్లీ ఆయన సోమవారం వరంగల్‌ మీదుగా ఎస్సారెస్పీ, కడెం, కాళేశ్వరం ప్రాజెక్టులపై ఏరియల్‌ సర్వే చేస్తారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశం..

వరదల నివారణకు శాశ్వత పరిష్కార మార్గాలు ఆలోచిద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. శనివారం రాత్రి హనుమకొండలోని కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు ఇంటికి ఆయన చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో సమావేశమయ్యారు. గోదావరి ప్రభావిత ప్రాంతాల్లోని వరదలపై సమీక్షించారు.

* శనివారం ఎర్రబెల్లి దయాకర్‌రావు ములుగు జిల్లాలో, సత్యవతి రాథోడ్‌ భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో వారిని అడిగి అక్కడి పరిస్థితిని ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. అనేక గ్రామాలకు తీవ్ర నష్టం జరిగిందని నేతలు ముఖ్యమంత్రికి వివరించారు. జంపన్నవాగుతోపాటు పరిసర ప్రాంతాల్లో చాలా వాగులు పొంగి పొర్లాయని.. ఇవన్నీ గోదావరిలోనే కలుస్తాయని దీంతో నది మహోగ్రరూపం దాల్చిందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కేసీఆర్‌కు వివరించారు.

* ఇటీవల వరంగల్‌ నగరంలో సైతం భారీ వర్షాలు కురిసినందున ఇక్కడి పరిస్థితి ఏమిటని సీఎం.. చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌ను అడిగారు. తాజాగా కురిసిన వర్షాలకు నగరంలోని కొన్ని కాలనీలు మాత్రమే జలమయమయ్యాయని వినయ్‌భాస్కర్‌ పేర్కొన్నారు.

సీఎం పర్యటన షెడ్యూల్​ ఇలా..

  • ఈరోజు ఉదయం 7 గంటలకు హనుమకొండ నుంచి ప్రారంభం
  • ఉదయం 7:45 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఏరియల్ సర్వే.. అనంతరం అధికారులతో సమీక్ష
  • ఉదయం 9:30 గంటలకు భద్రాచలం నుంచి తిరుగుపయనం
  • ఉదయం 9:45 గంటలకు ఏటూరునాగారంలో ఏరియల్ సర్వే.. అనంతరం అధికారులతో సమీక్ష
  • ఉదయం 11:00 గంటలకు ఏటూరు నాగారం నుంచి తిరుగుపయనం
  • ఉదయం 11:45 గంటలకు బేగంపేట ఎయిర్​పోర్ట్​కు చేరుకోనున్న సీఎం
  • అనంతరం సికింద్రాబాద్​ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనం
  • సోమవారం గోదావరి పరివాహాక ప్రాంతాల్లో ఏరియల్ సర్వే

ఇవీ చదవండి:ఎన్ని లక్షల మంది రైతుల ఆదాయం రెట్టింపయ్యిందో చెప్పాలి: కేటీఆర్

అఖిలపక్ష నేతలతో ఓంబిర్లా భేటీ.. వాటిపై చర్చించాలని కాంగ్రెస్​ డిమాండ్​

ABOUT THE AUTHOR

...view details