తెలంగాణ

telangana

భద్రకాళి అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

By

Published : Jul 31, 2020, 12:29 PM IST

ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మాస్కులు ధరించి వచ్చిన వారినే లోపలికి అనుమతిస్తున్నారు. భౌతిక దూరం పాటించేలా ప్రత్యేక క్యూలైన్​లు ఏర్పాటు చేశారు.

full fo devotees at warangal bhadrakali temple
భద్రకాళి అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

వరంగల్ అర్బన్ జిల్లా భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం, శుక్రవారం కలిసి రావడం వల్ల అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

కొవి​డ్​-19 నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు. మాస్కులు ధరించిన వారినే లోపలికి అనుమతిస్తున్నారు. భౌతిక దూరం పాటించే విధంగా ప్రత్యేక క్యూలైన్​లు ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ కారణంగా ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను అధికారులు రద్దు చేశారు.

ఇవీ చూడం ఇవీ చూడండి:ఔరా చిన్నారి: 22 రోజుల్లోనే రామాయణం లిఖించే.!

TAGGED:

ABOUT THE AUTHOR

...view details