తెలంగాణ

telangana

'కార్మికులేం ఫాంహౌజ్​లో పాలేర్లు కాదు...'

By

Published : Oct 14, 2019, 12:02 AM IST

రేపటి నుంచి విధులకు రావొద్దని ప్రకటిస్తే... కార్మికులేం ఫాంహౌస్​లో పాలేర్లు కాదని తెజస అధ్యక్షుడు కోదండరామ్​ సీఎం కేసీఆర్​ను ఎద్దేవా చేశారు. ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్​రెడ్డి మృతికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని మండిపడ్డారు.

TJS PRESIDENT PROF KODANDARAM ON CM KCR ABOUT TSRTC STRIKE

ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాసరెడ్డి మృతికి ప్రభుత్వమే భాద్యత వహించాలని తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్​ కోదండరామ్​ తెలిపారు. ప్రభుత్వ వైఫల్యం వల్లానే శ్రీనివాసరెడ్డి మృతి చెందాడన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో ఆర్టీసి కార్మికులు చేస్తున్న సమ్మెకు కోదండరామ్​ సంఘీభావం తెలిపారు. రేపటి నుంచి విధులకు రావొద్దంటె ఆర్టీసీ కార్మికులేం ఫాంహౌజ్​లో పాలేర్లు కాదని విమర్శించారు. ఈ సమ్మె తెలంగాణలో ఉన్న రుగ్మతలకు, నిరంకుశ పాలనకు పరిష్కారం చూపుతుందన్నారు. ప్రజాస్వామ్య తెలంగాణ సాధన కోసం జరుగుతున్న పోరాటంలో విజయం తథ్యమని ఎవరూ అధైర్య పడవద్దని కోదండరామ్​ సూచించారు.

'కార్మికులేం ఫాంహౌజ్​లో పాలేర్లు కాదు...'
TG_Hyd_46_13_RTC_JAC_Candle_Rally_AB_3182388 Reporter: Sripathi Srinivas Script: Razaq Note: ఫీడ్ త్రీజీ నుంచి వచ్చింది. ( ) ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరుపాలని ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్షం నేతలు కోరారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సహచర కార్మికులు విజ్ఞప్తి చేశారు. డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతికి సంతాపం తెలుపుతూ ఆర్టీసీ జేఏసీ అఖిలపక్షం ఆధ్వర్యంలో ముషిరాబాద్ బస్ డిపో నుంచి రాంనగర్‌ వరకు కొవ్వోత్తుల ర్యాలీ నిర్వహించారు. బైట్: పద్మ, అఖిలపక్ష నేత....

TAGGED:

ABOUT THE AUTHOR

...view details