తెలంగాణ

telangana

MP Arvind Comments on Kavitha Arrest : 'కవితను అరెస్ట్​ చేస్తే.. కాంగ్రెస్ బీజేపీలో విలీనం అవుతుందా..?'

By

Published : Jul 7, 2023, 4:13 PM IST

MP Arvind Latest News : వరంగల్​ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన విజయంవంతం చేసేందుకు బీజేపీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీలపై విమర్శలు చేశారు. కేసీఆర్​ కుటుంబ పాలన వల్లే రాష్ట్ర అభివృద్ధి జరగలేదని ఆరోపించారు.

MP Arvind Talk About Modi Warangal Tour
MP Arvind Talk About Modi Warangal Tour

రాష్ట్రంలో బీఆర్​ఎస్​ రాజకీయంగా ఉనికిని కోల్పోతుందన్న ఎంపీ అర్వివింద్​

MP Arvind Toured in Warangal: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలన వల్లే అభివృద్ధి జరగలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు​. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలో ప్రధాని మోదీ పర్యటన విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో అడ్డుకుంటుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం స్థలం కేటాయింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఆలస్యమైందని వ్యాఖ్యానించారు.

MP Arvind Comments on Congress Party : ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో రాజకీయంగా ఉనికిని కోల్పోతుందని విమర్శించారు. రాష్ట్రంలో మోదీ పర్యటన ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఇబ్బంది కలిగిస్తుందని.. అందుకే కేసీఆర్ మోదీని స్వాగతించడం లేదని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపైనా అర్వింద్​ తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్​కు బీజేపీ బీ టీం కాదని.. రేవంత్ రెడ్డి పట్టపగలు డబ్బులతో దొరికినా.. కేసీఅర్ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవితను అరెస్ట్​ చేస్తే తెలంగాణ కాంగ్రెస్ బీజేపీలోకి విలీనం అవుతుందా అని ప్రశ్నించారు.

"కేసీఆర్​ కుటుంబ పాలన పూర్తి నిర్లక్ష్యం వల్ల వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే కాజీపేట్​ కోచ్​ ఫ్యాక్టరీ ఆలస్యం అవుతోంది. టెక్స్​టైల్​ పార్క్​ అభివృద్ధికి ముందుకు కదలకపోవడం కేవలం బీఆర్​ఎస్​ అసమర్థతే. ఈ విషయం ప్రధాని మోదీ పర్యటనలో చెప్పనున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న రామప్ప దేవాలయం, వేయి స్తంభాల గుడి.. ఇవన్నీ యునెస్కో కింద గుర్తింపు పొందేలా చేసింది. వాటిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువచ్చింది. వాటికి కావాల్సిన నిధులు కేటాయించి అభివృద్ధి చేసింది. రాష్ట్రంలో బీజేపీ ప్రశ్నించినప్పటి నుంచి కాస్త అయినా.. అభివృద్ధి జరుగుతోంది. ఎమ్మెల్సీ కవితను అరెస్ట్​ చేస్తే.. కాంగ్రెస్​ పార్టీ నాయకులు బీజేపీలోకి విలీనం అవుతారా?. రాష్ట్ర ప్రభుత్వం పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డిని ఎందుకు అరెస్ట్​ చేయలేదు."- ధర్మపురిఅర్వింద్​,నిజామాబాద్ ఎంపీ

PM Modi Warangal Tour : ప్రధాని సభకు ముస్తాబవుతున్న ఓరుగల్లు... నోఫ్లై జోన్​గా పరిసర ప్రాంతాలు

PM Modi Warangal Tour 2023 Schedule: వరంగల్‌ పర్యటనలో భాగంగా జులై 8న ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి రానున్నారు. శనివారం ఉదయం 9.25 గంటలకు హైదరాబాద్‌ హకీంపేటకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌ ద్వారా 10.15 గంటలకు వరంగల్‌కు చేరుకుంటారు. అనంతరం రోడ్డుమార్గంలో భద్రకాళీ దేవాలయానికి వెళ్లి ప్రధాని మోదీ.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తరవాత వ్యాగన్‌ పరిశ్రమ నిర్మాణానికి వర్చువల్‌గా భూమి పూజ చేస్తారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. సుమారు 1.40 గంటలకు తిరిగి హకీంపేటకు చేరుకుని.. ప్రత్యేక విమానంలో రాజస్థాన్‌ వెళ్లనున్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details