తెలంగాణ

telangana

'తెలంగాణ ఏర్పడిన తర్వాత స్వర్ణయుగం వచ్చింది'

By

Published : Aug 24, 2020, 5:25 PM IST

వరంగల్‌ గ్రామీణ, మహబూబాబాద్‌ జిల్లాలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు... కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు పంపిణీ చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాడి పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయని వెల్లడించారు.

minsters-errabelli-and-talasani-tour-at-warangal
'తెలంగాణ ఏర్పడిన తర్వాత స్వర్ణయుగం వచ్చింది'

రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయం, పాడి పరిశ్రమలకు స్వర్ణయుగం వచ్చిందని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సహచర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి వరంగల్‌ గ్రామీణ, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఆయన పర్యటించారు.

'తెలంగాణ ఏర్పడిన తర్వాత స్వర్ణయుగం వచ్చింది'

మంత్రులు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాయపర్తి మండలం మైలారంలోని ప్రభుత్వ పాఠశాలలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. రాయితీ కింద మంజూరైన పాడి పశువులను అర్హులకు అందించారు. 10 లక్షల చేప పిల్లలను మైలారం చెరువులో వదిలారు. అనంతరం పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో కిసాన్ కార్డులు పంపిణీ చేశారు. విజయ డైరీ ఆవరణలో మొక్కలు నాటారు. విజయ డైరీ మొబైల్ అవుట్‌లెట్లను ప్రారంభించారు.

ఇదీ చూడండి:కీసర లంచం కేసు: 3 రోజుల అనిశా కస్టడీకి నిందితులు

ABOUT THE AUTHOR

...view details