తెలంగాణ

telangana

అధికారులు మా భూముల్లోకి రావద్దు.. గ్రీన్​ఫీల్డ్​ హైవే వద్దంటూ అన్నదాతల ఆందోళన

By

Published : Mar 26, 2022, 5:43 PM IST

Farmers Protest: గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను వెంటనే నిలిపి వేయాలని రైతులు ఆందోళన చేపట్టారు. తమ అనుమతులు లేకుండా భూముల్లోకి అధికారులు రావొద్దని వరంగల్ జిల్లా ఏనుగల్లు గ్రామంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. సర్వేల పేరుతో తమ భూముల్లోకి అధికారులు రావద్దని రైతన్నలు హెచ్చరిస్తున్నారు.

అధికారులు మా భూముల్లోకి రావద్దు.. గ్రీన్​ఫీల్డ్​ హైవే వద్దంటూ అన్నదాతల ఆందోళన
అధికారులు మా భూముల్లోకి రావద్దు.. గ్రీన్​ఫీల్డ్​ హైవే వద్దంటూ అన్నదాతల ఆందోళన

Farmers Protest: తమ అనుమతులు లేకుండా భూముల్లోకి అధికారులు రావొద్దని అన్నదాతలు ఆందోళనకు దిగారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామం మీదుగా నిర్మించ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను వెంటనే నిలిపి వేయాలని రైతులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. గ్రీన్ ఫీల్డ్ హైవే కారణంగా చిన్న సన్నకారు రైతులకు చెందిన భూములు కోల్పోయే ప్రమాదం ఉందని అన్నదాతలు వాపోయారు. వ్యవసాయమే జీవనాధారంగా చేసుకొని బతుకుతున్న తమ భూములను ఎవ్వరికి ఇచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు. సర్వేల పేరుతో తమ భూముల్లోకి అధికారులు రావద్దని రైతన్నలు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వైఖరిని మార్చుకోవాలని అన్నదాతలు అన్నారు.

ఏనుగల్లు నుంచి హైవే రోడ్డు రానుంది. రహదారి నిర్మాణంలో దాదాపు 200 తాటిచెట్లు పోతున్నాయి. తాటిచెట్ల మీదే ఆధారపడి జీవిస్తున్న 70 కుటుంబాలు ఆ రోడ్డు వల్ల బతుకుదెరువును కోల్పోతున్నాయి. ప్రభుత్వం ఆ రహదారిని ఆపాలి. లేకపోతే మాకు ఏదైనా ఆదెరువు చూపెట్టాలె. -గీత కార్మికుడు, ఏనుగల్లు

మాది 3 ఎకరాల భూమి పోతోంది. దానితో పాటు బావి కూడా పోతోంది. దయచేసి గ్రీన్​ఫీల్డ్​ హైవేను అడ్డుకోవాలి. ఆ భూమి మీదే ఆధారపడి మేము జీవిస్తున్నాం. -రైతు, ఏనుగల్లు

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details