తెలంగాణ

telangana

వార్షిక రుణ ప్రణాళిక విడుదల చేసిన కలెక్టర్ యాస్మిన్ భాషా

By

Published : Sep 4, 2020, 10:47 PM IST

వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రాధాన్యతనిస్తూ 2020 - 21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 2331 .85 కోట్ల అంచనాతో రూపొందించిన వనపర్తి జిల్లా వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా శుక్రవారం విడుదల చేశారు. జిల్లాలో అర్హులైన వారందరికీ రుణాలిచ్చి.. జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని కలెక్టర్​ బ్యాంకర్లను ఆదేశించారు.

collector yasmin basha at wanaparthy
వార్షిక రుణ ప్రణాళిక విడుదల చేసిన కలెక్టర్ యాస్మిన్ భాషా

వనపర్తి జిల్లాలో బ్యాంకర్ల సంప్రదింపుల సలహామండలి సమీక్ష సమావేశంలో 2020-21 వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ యాస్మిన్ భాషా విడుదల చేశారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది రూ. 750 కోట్ల పెరుగుదల ఈ వార్షిక ప్రణాళికలో ఉందని అధికారులు తెలిపారు. 2020 - 21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 2331 .85 కోట్ల అంచనాతో వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు.

ఈ వార్షిక రుణ ప్రణాళికలో పంట రుణాల కోసం రూ.1656. 27 కోట్లు, వ్యవసాయ కాల పరిమితి రుణాల కోసం రూ.157. 39 కోట్లు, వ్యవసాయ కాల పరిమితి అనుబంధ కార్యకలాపాలకు రూ.152.23 కోట్లు, రైతులకు రూ.196 5.89 కోట్ల రుణాలు లక్ష్యంగా మొత్తం వ్యవసాయ రంగంపై రూ. 2157.66 కోట్ల రుణాల అంచనాతో రుణ ప్రణాళిక రూపొందించారు.

వార్షిక రుణ ప్రమాళికలో చిన్న, సూక్ష్మ, మధ్య తరహా ఔత్సాహిక పరిశ్రమలకు రూ.44.96 కోట్లు, విద్య ఋణాలకింద రూ.5.75 కోట్లు, గృహ ఋణాలకింద రూ.12.3 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇతర ప్రాధాన్యత రంగాలకు రూ.28.7 కోట్లు, మొత్తం ప్రాధాన్యత రంగానికి రూ. 2231.34 కోట్ల ఋణాలివ్వాలని ప్రణాళికలో రూపొందించడం జరిగింది.

జిల్లాలో అర్హత ఉన్న ప్రతి వీధి వ్యాపారికి ఋణాలివ్వాలని బ్యాంకర్లను కలెక్టర్​ యాస్మిన్ ఆదేశించారు. మత్స్య కార్మికులకు ఇచ్చే రుణాలపై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ ఇప్పటివరకు ఎలాంటి రుణాలు మంజూరు చేయలేదని, అయితే మత్స్య ఉత్పత్తిలో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని, అందువల్ల దీనిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి తప్పనిసరిగా మత్స్యకారులకు రుణాలు ఇవ్వాలని ఈ రంగంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు.

ఇవీచూడండి:ఈఎస్​ఐ కేసు: దేవికారాణితోపాటు మరో ఎనిమిది మంది అరెస్ట్

TAGGED:

ABOUT THE AUTHOR

...view details