తెలంగాణ

telangana

అక్టోబర్​ 10 నాటికి రైతు వేదికలు పూర్తికావాల్సిందే: కలెక్టర్​

By

Published : Sep 23, 2020, 11:26 AM IST

రైతు వేదిక పనులు నత్తనడకన సాగడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు వనపర్తి జిల్లా కలెక్టర్​. కారణాలపై ఆరా తీశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ 10 నాటికి పూర్తి చేయాల్సిందేనని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

wanaparthy collector
అక్టోబర్​ 10 నాటికి రైతు వేదికలు పూర్తికావాల్సిందే: కలెక్టర్​

రైతు వేదికలను అక్టోబరు 10 నాటికి పూర్తిచేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష స్పష్టం చేశారు. పానుగల్ మండలంలోని పలు గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న రైతు వేదికలను పాలనాధికారి తనిఖీ చేశారు.

సాంకేతిక పరంగా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పనులు నత్తనడకన సాగడంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతు వేదికల పురోగతి, సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కార మార్గాలను సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ 10 నాటికి పూర్తి చేయాల్సిందేనని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం మొక్కలు నాటారు.

ఇవీచూడండి:'అక్టోబర్‌ 10 నాటికి రైతు వేదికల నిర్మాణాలు పూర్తవ్వాలి'

ABOUT THE AUTHOR

...view details