తెలంగాణ

telangana

కాంగ్రెస్‌ నేతలు పెట్టేది భూమాత కాదు భూ'మేత' - ధరణి తీసేస్తే మళ్లీ దళారీల రాజ్యమే : సీఎం కేసీఆర్

By ETV Bharat Telangana Team

Published : Nov 22, 2023, 2:04 PM IST

Updated : Nov 22, 2023, 2:21 PM IST

CM KCR Speech at Thandur Public Meeting : ధరణి తీసేసి భూమాత పెడతామని కాంగ్రెస్​ నేతలు చెబుతున్నారని.. వారు పెట్టేది భూమాత కాదు భూమేత అని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. ధరణి తీసేస్తే రైతుబంధు, ధాన్యం డబ్బులు, రైతుబీమా ఎలా అందుతాయని ప్రశ్నించారు. ధరణిని తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తాండూరులో ఏర్పాటు చేసిన సభలో ఈ మేరకు మాట్లాడారు.

BRS Praja Ashirwada Sabha at Thandur
CM KCR Speech at Thandur Public Meeting

CM KCR Speech at Thandur Public Meeting : ఎన్నికలు రాగానే ప్రజలు ఆగం కావొద్దని బీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్ మరోసారి సూచించారు. ఓటు వేసే ముందు అభ్యర్థుల గుణగణాలు, పార్టీల చరిత్ర పరిశీలించాలని పునరుద్ఘాటించారు. ప్రజల చేతుల్లో ఉండే ఏకైక వజ్రాయుధం ఓటని.. అది ప్రజల తలరాతను మారుస్తుందని స్పష్టం చేశారు. తమ ఓటును సక్రమంగా ఉపయోగించుకుంటే ఐదేళ్ల భవిష్యత్‌ బాగుంటుందన్నారు. వికారాబాద్​ జిల్లా తాండూరులో ఏర్పాటు చేసిన బీఆర్​ఎస్​ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన ఈ మేరకు మాట్లాడారు.

హలో నేను కేసీఆర్​ను - మీ దగ్గర పరిస్థితి ఎలా ఉంది - గెలుపు ఖాయమేగా ?

BRS Praja Ashirwada Sabha at Thandur :భారత్​ రాష్ట్ర సమితి పార్టీ పుట్టిందే తెలంగాణ సాధన కోసమని కేసీఆర్​ పేర్కొన్నారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్‌ అని విమర్శించారు. 55 ఏళ్లు తెలంగాణ ప్రజలను కాంగ్రెస్‌ ఇబ్బంది పెట్టిందన్న కేసీఆర్‌.. కాంగ్రెస్‌ హయాంలో తాగు, సాగు నీరు, విద్యుత్‌ కష్టాలు ఉండేవని గుర్తు చేశారు. మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ తాగు నీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో వలసలు ఎక్కువగా ఉండేవని.. ప్రస్తుతం పరిస్థితులు మారాయని చెప్పారు.

ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలే అందుకే ఆలోచించి ఓటేయండి : కేసీఆర్

దేశంలోనే నీటి పన్నును రద్దు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ పేర్కొన్నారు. రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.2 వేలకు పెంచామని గుర్తు చేశారు. రైతు బంధు పథకాన్ని పుట్టించిందే కేసీఆర్‌ అని.. కాంగ్రెస్​ నేతలు ఆ పథకాన్ని దుబారా అంటున్నారని మండిపడ్డారు. రైతుబంధు దుబారా అని ప్రజలను ప్రశ్నించారు. ఈసారి ఎన్నికల్లో గెలిస్తే రైతుబంధు మొత్తాన్ని రూ.16 వేలకు పెంచుతామన్నారు. ఈ క్రమంలోనే ధరణి తీసేసి భూమాత పెడతామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారన్న ఆయన.. కాంగ్రెస్‌ నేతలు పెట్టేది భూమాత కాదు.. భూమేత అని ఎద్దేవా చేశారు. ధరణి తీసేస్తే మళ్లీ దళారీల రాజ్యం వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ మన ఓటుతో మన కళ్లల్లోనే పొడిపించాలని చూస్తోంది: కేసీఆర్

''రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.2 వేలకు పెంచాం. నీటి పన్నును రద్దు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. రైతు బంధు పథకాన్ని పుట్టించిందే కేసీఆర్‌. రైతుబంధు దుబారా అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారు. రైతుబంధు దుబారానా? మరోసారి బీఆర్​ఎస్​ గెలిస్తే రైతుబంధు రూ.16 వేలకు పెంచుతాం. బొటన వేలు ముద్ర లేకుండా భూ యాజమాన్యపు హక్కులు ఎవరూ మార్చలేరు. ధరణి తీసేసి భూమాత పెడతాం అని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. కాంగ్రెస్‌ నేతలు పెట్టేది భూమాత కాదు.. భూమేత. ధరణి తీసేస్తే రైతుబంధు, ధాన్యం డబ్బులు, రైతుబీమా డబ్బులు ఎలా వస్తాయి? ధరణి తీసేస్తే మళ్లీ దళారీల రాజ్యం వస్తుంది. కర్ణాటకలో రైతులకు 5 గంటల కరెంట్‌ ఇస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ వస్తే మనకు కూడా 5 గంటల కరెంట్‌ దిక్కు అవుతుంది.'' - కేసీఆర్‌, ముఖ్యమంత్రి

బీజేపీ, కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల్లో నీటి పన్నులు - తెలంగాణలో మాత్రం నీటి పన్ను లేదు : కేసీఆర్​

Last Updated :Nov 22, 2023, 2:21 PM IST

ABOUT THE AUTHOR

...view details