తెలంగాణ

telangana

'నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు'

By

Published : Jun 6, 2021, 9:12 AM IST

తుంగతుర్తి మండల కేంద్రంలోని పలు ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ దుకాణాల్లో టాస్క్​ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి దుకాణంలో ధరల పట్టికతో పాటు స్టాక్ వివరాలు ప్రదర్శించాలని చెప్పారు.

police rides, fertilizer shops
ఫర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీలు, పెస్టిసైడ్ దుకాణాల్లో తనిఖీలు

నకిలీ విత్తనాలను విక్రయించే దుకాణాదారులపై చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి సీఐ రవి హెచ్చరించారు. తుంగతుర్తి మండల పరిధిలోని పలు ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ దుకాణాల్లో టాస్క్​ఫోర్స్ బృందం శనివారం ఆకస్మిక తనిఖీ చేపట్టింది. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని సీఐ తెలిపారు. రైతులు అడిగిన విత్తన ప్యాకెట్లు మాత్రమే వారికి విక్రయించాలని… అదనంగా అనుసంధానం చేసి ఇతర ప్యాకెట్లను ఇవ్వరాదని ఆదేశించారు. ప్రతి దుకాణంలో ధరల పట్టికతో పాటుగా స్టాక్ వివరాలు ప్రదర్శించాలని చెప్పారు.

ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విత్తనాలను విక్రయించాలని ఆదేశించారు. కాలపరిమితి దాటిన విత్తనాలను వెంటనే దుకాణంలో నుంచి తీసేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి సమస్యలు వచ్చినా తమకు తెలియజేయాలని సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టాస్క్​ఫోర్స్ బృందం సభ్యులు మండల వ్యవసాయ అధికారి బాలకృష్ణ, ఎస్సై ఆంజనేయులు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:బీమా కోసం డ్రామా.. భార్య మృతిపై భర్త తప్పుడు కథనం!

ABOUT THE AUTHOR

...view details