తెలంగాణ

telangana

మృతుడి కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితులు

By

Published : Jun 13, 2021, 9:34 AM IST

అనారోగ్యంతో మృతిచెందిన ఓ వ్యక్తి కుటుంబానికి ఆయన మిత్రులు అండగా నిలిచారు. అందరూ కలిసి ఆర్థిక సాయం చేశారు. అంతేకాకుండా మరికొంతమంది దాతలు ముందుకురావాలని కోరుతున్నారు.

financial help, friends help
స్నేహితుల ఆర్థిక సాయం, మిత్రుల సాయం

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం దేవునిగుట్ట తండాకు చెందిన రాంసింగ్ అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందగా.. స్నేహితులు, అధ్యాపకులు అండగా నిలిచారు. మృతుడికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఇటీవలే ఆయన తండ్రి మరణించడంతో ఆ కుటుంబం పరిస్థితి దీనంగా మారింది. ఈ విషయాన్ని వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలుసుకున్న ఆయన బీఈడీ క్లాస్​మేట్స్, అధ్యాపకులు ఆ కుటుంబానికి అండగా నిలిచారు. అందరు కలిసి రూ.50,000 జమచేసి బాధిత కుటుంబానికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో బీఈడీ క్లాస్​మేట్స్ మురళీధర్ రెడ్డి, సత్యకాంత్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, జితేందర్​లు ఉన్నారు. రాజకీయ నాయకులు, దాతలు స్పందించి బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీరికి బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చదవండి:మైదానంలోనే కుప్పకూలిన ఫుట్​బాల్ ఆటగాడు

ABOUT THE AUTHOR

...view details