తెలంగాణ

telangana

'పండించిన పంటకు సరైన ధర చెల్లించట్లేదు'

By

Published : Apr 20, 2021, 11:17 AM IST

హుజూర్ నగర్ పట్టణంలో రైస్ మిల్ యజమానులు ధాన్యం కొనుగోలులో ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు తెలిపారు. వారు పండించిన పంటకు సరైన ధర చెల్లించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

huzur nagar rice mills
రైతుల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు

హుజూర్ నగర్ పట్టణంలో రైస్ మిల్ యజమానులు ధాన్యం కొనుగోలు చేయకుండా రైతుల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆరోపించారు. మఠంపల్లి మండలం బక్కమంతుల గ్రామానికి చెందిన రైతులు సుమారు 200 ఎకరాలలో 1010 క్రాసింగ్ చేసిన జగిత్యాల సీడ్స్​తో పంట పండించారు. ఈ సీడ్స్​ ఎకరానికి 50 నుంచి 60 బస్తాలు పండుతాయని అధికారులు చెప్పటంతో రైతులు ఈ పంట పండించేందుకు మక్కువ చూపారు.ఐకేపీ సెంటర్లు ఈ సీడ్స్​ని ఏ గ్రేడ్ రకం కింద సెలెక్షన్ చేశాయి. ఈ ధాన్యంలో తాలుగాని నిమ్ముగాని లేవని రైతులు తెలిపారు. వానాకాలంలో పండించిన పంటలో రైతులకు నష్టం వాటిల్లిందని తెలిపారు.ఈ సారి పంట దిగుబడి వచ్చిన మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయకుండా ఏ రకం ధాన్యం ను బి రకం కింద తీసుకున్నారు. దీంతో రైతులకు బస్తాకు 20 రూపాయల వరకు నష్టం వాటిల్లిందని రైతులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు ధాన్యం కొనుగోలు చేయనందున అధిక కిరాయి భారం పడుతుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details