తెలంగాణ

telangana

COLONEL SANTHOSH BABU:రేపు కల్నల్ సంతోశ్​బాబు ప్రథమ వర్ధంతి.. తల్లిదండ్రుల భావోద్వేగం!

By

Published : Jun 14, 2021, 5:10 AM IST

Updated : Jun 14, 2021, 6:26 AM IST

సూర్యాపేట జిల్లాకు చెందిన కల్నల్ సంతోశ్​బాబు అసువులు బాసి రేపటికి ఏడాది కావస్తుంది. ఈ సందర్భంగా సంతోశ్​బాబు తల్లిదండ్రులు తమ మనోవేదనను పంచుకున్నారు. కుమారుడి మరణం ఓవైపు బాధగానే ఉన్నా.. అందరి మనసుల్లో స్థానం సంపాదించుకున్నందుకు గర్వంగా ఉందన్నారు.

'ఓవైపు బాధగానే ఉన్నా.. మరోవైపు గర్వంగా ఉంది'
'ఓవైపు బాధగానే ఉన్నా.. మరోవైపు గర్వంగా ఉంది'

రేపు కల్నల్ సంతోశ్​బాబు ప్రథమ వర్ధంతి.. తల్లిదండ్రుల భావోద్వేగం!

గాల్వన్​ లోయలో సూర్యాపేట జిల్లా వాసి కల్నల్​ సంతోశ్​బాబు వీరమరణం పొంది.. ఈ నెల 15కు ఏడాది కావస్తోంది. ఈ సందర్భంగా కల్నల్​ తల్లిదండ్రులు ఈటీవీ-ఈటీవీ భారత్​తో తమ మనోవేదన పంచుకున్నారు.

కుమారుడిని కోల్పోయినందుకు తల్లిదండ్రులుగా బాధగానే ఉన్నా.. సంతోశ్​బాబు అందరి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నందుకు గర్వంగా ఉందని భావోద్వేగానికి లోనయ్యారు. తన త్యాగంతో ఎంతోమందిలో స్ఫూర్తి నింపాడని అన్నారు.

మరోవైపు సూర్యాపేటలోని కోర్టు చౌరస్తాకు కల్నల్ సంతోశ్​బాబు కూడలిగా నామకరణం చేయనున్నారు. సంతోశ్​బాబు వర్ధంతిని పురస్కరించుకుని ఆయన కాంస్య విగ్రహాన్ని మంగళవారం మంత్రి కేటీఆర్ ఆవిష్కరించనున్నారు.

ఇదీ చూడండి: సీజేఐని కలిసిన డీజీపీ, పోలీసు అధికారులు

Last Updated : Jun 14, 2021, 6:26 AM IST

ABOUT THE AUTHOR

...view details